04-08-2025 08:08:42 PM
తంగళ్ళపల్లి (విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా(Rajanna Sircilla District) తంగళ్లపల్లి మండలం నేరెళ్లలో కేటీఆర్ సేన గ్రామ శాఖ అధ్యక్షునిగా వోడ్నాల మహేష్ ఎన్నుకోవడం జరిగింది. ఈ సందర్భంగా భాస్కర్ గౌడ్ మాట్లాడుతూ, యువతను గ్రామ గ్రామాన బలోపేతం చేస్తామన్నారు. కేటీఆర్ సిరిసిల్ల నియోజక వర్గానికి చేసిన అభివృద్ధిని గురించి, బీఆర్ఎస్ ప్రభుత్వం గతంలో చేసిన సంక్షేమ పథకాలను గురించి గడప గడపన వివరీస్తాం అన్నారు. ఏ ఎలక్షన్స్ వచ్చిన కచ్చితంగా బీఆర్ఎస్ పార్టీనే గెలుస్తుంది అని తెలిపారు. ఈ ప్రభుత్వం అబద్ధపు హామీలతో ప్రజలను పూర్తిగా మోసం చేసిందని ప్రజా క్షేత్రంలోనే ఈ ప్రభుత్వానికి బుద్ధి చెబుతాం అని తెలిపారు.
ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు దోమల కొమురయ్య, కొత్త సంతోష్ గౌడ్, గోగు మల్లేశం,బొమ్మ దేవయ్య, నందగిరి నాగరాజు, నందగిరి సురేందర్,దోమల హరీష్,దోమల వంశీ, వోడ్నాల శ్రీకాంత్, తొట్ల శివాజీ, పోచంపల్లి కిషన్,పోచంపల్లి నితిన్, పరుస ప్రశాంత్, పరుస నవీన్,గుగ్గిళ్ళ ప్రశాంత్, అల్వాల చింటూ,కొత్త అజయ్ తదితరులు పాల్గొన్నారు.