calender_icon.png 10 August, 2025 | 9:50 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రహదారిపై పడిన భారీ వృక్షం తొలగింపు

10-08-2025 07:18:44 PM

ములకలపల్లి,(విజయక్రాంతి): ములకలపల్లి మండలం తొగ్గూడెం గ్రామానికి వెళ్లే రహదారిపై భారీ వృక్షం ఒకటి గాలి వానకు నేలకూలి రహదారిపై పడింది. రాకపోకలకు ఇబ్బందిగా మారింది. ఆదివారం ఈ విషయం తెలుసుకున్న కాంగ్రెస్ పార్టీ నాయకులు వెంటనే స్పందించి సొంతంగా ఖర్చులు భరించి మిషన్లతో చెట్లను తొలగించి, రహదారిపై అడ్డంగా పడి రాకపోకలను పునరుద్ధరించారు. వారిని గ్రామస్తులు అభినందించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ మండల కాంగ్రెస్ నాయకులు కొప్పులరాంబాబు, సున్నం నాగేష్, కారం రాజు, శ్రీను, కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కోఆర్డినేటర్ సున్నం నాగరాజు గ్రామస్తులు పాల్గొన్నారు.