14-07-2025 12:55:20 AM
హైదరాబాద్, జూలై 13 (విజయక్రాంతి): నదీ జలాలపై కాంగ్రెస్ నేతలు ఇస్తున్న పవర్ పాయింట్ ప్రజెంటేషన్ల(పీపీటీ)లో పసలేదని బీఆర్‌ఎస్ నేతల ఎర్రోళ్ల శ్రీనివాస్ విమర్శించారు. గాంధీ భవన్‌ను గలీజు భవన్‌గా కాంగ్రెస్ నేతలు మార్చారని ఆరోపించారు. ఆదివారం తెలంగాణ భవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో శ్రీనివాస్ మాట్లాడుతూ చామల కిరణ్‌కుమార్ రెడ్డి ఎంపీ కావడం భువనగిరి ప్రజల కర్మఅని, బేసిన్‌ల గురించి తెలియని చామల.. హరీశ్ రావు ను విమర్శించడమా అని ప్రశ్నించారు.
వార్డు మెంబర్‌కు ఎక్కువ.. ఎంపీకి తక్కువ అని, ఎంపీ చామలకు సబ్జెక్టు లేకపోతే తమ నేతల దగ్గర ట్యూషన్ చెప్పించుకోవాలని, తానే అపాయింట్‌మెంట్ ఇప్పిస్తా అని దెప్పి పొడిచారు. చంద్రబాబు నీళ్లను తరలించుకుపోతుంటే ఆయన గురించి మాట్లాడకుండా కేసీఆర్‌పై విమర్శలా అని ఆయన మండిపడ్డారు. పర్సంటేజ్‌లు, కమీషన్లు కాంగ్రెస్ పాలనలో నిత్యకృత్యమయ్యాయని శ్రీనివాస్ ఆరోపించారు.