calender_icon.png 14 July, 2025 | 9:01 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పేదవాడి చూపునకు సుంకిరెడ్డి వెలుగులు

14-07-2025 12:55:21 AM

- తొమ్మిది రోజుల పాటు ఉచిత కంటి శిబిరం. 6 వేల మందికి పైగా లబ్ధి

కల్వకుర్తి, జూలై 13:కంటి చూపు కోల్పోతున్న పేదవాడికి సుంకిరెడ్డి ప్రసాదించిన ఉచిత కంటి వైద్య శిబిరం కల్వకుర్తిలో విజయవంతంగా ముగిసింది. ఐక్యత ఫౌండేషన్, శంకర నేత్రాలయ సహకారంతో నిర్వహించిన ఈ శిబిరానికి అనూహ్య స్పందన లభిం చింది. జూలై 4 నుంచి 13 వరకు, సరిగ్గా తొ మ్మిది రోజులపాటు నిర్వహించిన ఈ శిబిరంలో 6వేల మందికిపైగా ప్రజలు హాజర య్యారు.

ఈ శిబిరాన్ని ఐక్యత ఫౌండేషన్ చై ర్మన్, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు, తెలంగాణ అకాడమీ ఆఫ్ స్కిల్ అండ్ నాలెడ్జ్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి పర్యవేక్షణలో ఏర్పాటు చేశారు.4,400 మందికి కంటి పరీక్షలు నిర్వహించగా,3వేల మందికి ఉచిత కంటి అద్దాలు పంపిణీ చేశా రు. నిరుపేద కుటుంబాలకి చెందిన 153 మందికి కంటి శుక్లాల శస్త్ర చికిత్సలు పూర్తి చేశారు. ఆదివారం శిబిర ముగింపు కార్యక్రమాన్ని పట్టణంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హా ల్లో నిర్వహించగా ముఖ్య అతిథిగా సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి పాల్గొని మాట్లాడారు.ఐక్యత ఫౌండేషన్ ఆధ్వర్యంలో గత సంవత్సర కాలంగా ఉచిత కంటి వైద్య శిబిరాలు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు.

మొదట గా ఏర్పాటు చేసిన కంటి శిబిరానికి వచ్చిన ప్రజల స్పందన తెలుసుకొని నియోజకవర్గం వ్యాప్తంగా ఈ కంటి శస్త్ర చికిత్స శిబిరాల అ వసరం చాలా ఉందని గమనించి మండలా ల వారిగా చాలా మంది నిరుపేదలు ఆర్థిక సమస్యలతో కూడా కంటి ఆరోగ్యాన్ని నిర్ల క్ష్యం చేస్తున్నారని, వారికి పెద్ద ఎత్తున అవగాహన కల్పిస్తూ అవసరమైన వారికి ఉచిత అ ద్దాలు పంపిణీ చేస్తూ, నిరుపేదలకు ఉచిత కంటి శుక్లాల ఆపరేషన్లు చేస్తూ వారికి చూపు కి భరోసానిచ్చే విధంగ ముందుకు సాగుతున్నామన్నారు.

ప్రతి మండలంలో సేవా శిబి రాలు ఏర్పాటు చేసి అవసరమైన వారికి శస్త్రచికిత్సలు, అద్దాలు అందించేందుకు నిరంత రం కృషిచేస్తామని తెలిపారు. ముగింపు కా ర్యక్రమంలో తొమ్మిది రోజులపాటు వైద్య సేవలు అందించిన శంకర్ నేత్రాలయ డాక్ట ర్స్ వారి సిబ్బంది ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఐక్యత ఫౌండేషన్ సభ్యులు శ్రీరాములు, నరేందర్ గౌడ్, యూ సుఫ్, గణేష్, రఘు, యాదయ్య, కొండల్, శేఖర్, రమేష్ నాయక్, శ్రీపతి, రాఘవేందర్, నాగిళ్ల శివ, శ్రీను, కళ్యాణ్, మల్లేష్, భాస్కర్ తదితరులుపాల్గొన్నారు.