05-08-2025 12:59:46 AM
ఘట్ కేసర్, ఆగస్టు 4 : అనురాగ్ యూనివర్సిటీలో నెక్సస్ క్లబ్ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించింది. జన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వర్క్‌షాప్ డేటా సైన్స్ విభాగం ఆధ్వర్యంలో అనురాగ్ యూనివర్సిటీ నెక్సస్ క్లబ్ పైలట్ నావిగేట్ వరల్ ఆఫ్ జెన్ ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ అనే ఒక రోజు వర్క్‌షాప్‌ను విజయవంతంగా నిర్వహించింది.
జెన్ ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ జిపిటి జెమిని క్లౌడ్ మోడళ్లపై ప్రామ్ట్ ఇంజినీరింగ్, గూగుల్ కొలాబ్ స్ట్రీమ్ లిట్ వేదికలపై అప్లికేషన్ అభివృద్ధిపై విద్యార్థులకు తత్వజ్ఞానం మరియు ప్రాయోగిక శిక్షణ ఇవ్వబడింది. ప్రాజెక్ట్ ఇంజినీర్ అరివళగన్ టీ, విభాగాధిపతి డాక్టర్ ఎం. శ్రీదేవి, ఫ్యాకల్టీ కోఆర్డినేటర్ వై. సుగుణారెడ్డి, స్టూడెంట్ కోఆర్డినేటర్లు విష్ణువర్ధన్ రెడ్డి, అక్షిత్ సారథ్యంలో ఈ వర్క్‌షాప్ విజయవంతంగా నిర్వహించడం జరిగింది. ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో విద్యార్థుల నైపుణ్యాభివృద్ధికి మరొక ముఖ్యమైన మైలురాయిగా నిలిచింది.