05-08-2025 12:58:52 AM
కృష్ణ ఆరోగ్య పరిస్థితి విషమం
బాధ్యులపై చర్యలు తీసుకోవాలని బంధువుల డిమాండ్
హుజురాబాద్, ఆగస్టు 4 (విజయక్రాంతి): అప్పు వివాదం ఓ వ్యక్తి ప్రాణాలపైకి తెచ్చింది. అప్పు తీసుకున్నవాడు తిరిగి ఇవ్వకపోవడంతో, బాధితుడు సెల్ఫీ వీడియో తీసి గడ్డి మందు సేవించి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన కరీంనగర్ జిల్లా హుజురాబాద్ పట్టణంలో స్థానికంగా కలకలం రేపింది.వివరాల్లోకి వెళితే... హుజూరాబాద్కు చెందిన పంజాల కృష్ణ, వనం హరీష్ అనే హోటల్ వ్యాపారికి రూ.25 లక్షలు అప్పుగా ఇచ్చారు.
సుమారు ఏడాది గడిచినా హరీష్ అప్పు తిరిగి ఇవ్వకపోవడంతో, కృష్ణ హోటల్ వద్దకు వెళ్లి నేను అప్పుగా ఇచ్చిన మొత్తం రూపాయలు ఇవ్వాలని అడిగాడు. అయితే, అప్పు అడిగినందుకే హరీష్ అతనిపై ఘాటు మాటలు పలికినట్టు సమాచారం. బెదిరింపులకు గురైన కృష్ణ తీవ్ర మనస్తాపానికి లోనై, పట్టణంలోని హైస్కూల్ మైదానానికి వెళ్లి గడ్డి మందు తాగిఅపస్మారక స్థితిలో కనిపించిన కృష్ణను స్థానికులు వెంటనే ప్రభుత్వాసుపత్రికి తరలించగా, అక్కడ ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన చికిత్స కోసం జమ్మికుంటలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు.
ప్రస్తుతం ఆయన ఆరోగ్యం విషమంగా ఉందని కుటుంబసభ్యులు తెలిపారు.ఈ ఘటనపై స్పందించిన బంధువులు, అప్పు తీర్చకుండానే బెదిరింపులకు పాల్పడి కృష్ణ ఆత్మహత్యాయత్నానికి కారకుడైన వనం హర్పీ కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ఆత్మహత్యాయత్నానికి ముందు కృష్ణ తీసిన సెల్ఫీ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.