calender_icon.png 30 December, 2025 | 6:10 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

‘ప్రాడ్ కాఫుల్ స్టాప్’ పోస్టర్ ఆవిష్కరణ

30-12-2025 02:08:38 AM

నిర్మల్, డిసెంబర్ 29 (విజయక్రాంతి): నిర్మల్ జిల్లాలో సైబర్ నేరాలు పట్ల ప్రజలను అప్రమత్తం చేస్తున్నట్టు జిల్లా ఎస్పీ జానకి షర్మిల తెలిపారు. సోమవారం ఎస్పీ కార్యాలయంలో సైబర్ నేరాలు డిజిటల్ అరెస్ట్‌ల నేపథ్యంలో ‘ప్రాడ్ కాఫుల్ స్టాప్’ పోస్టర్లను ఎస్పీ ఆవిష్కరించారు.

సైబర్ డిజిటల్ నేరాలు జరగడానికి గల కారణాలను గురించి వాటిని దూరంగా ఉంచుకునేందుకు ప్రజలు చర్యలు తీసుకోవాలని అన్నారు. సైబర్ నేరానికి గురైతే 1930కి వెంటనే కాల్ చేయాలని సూచించారు డిజిటల్ అరెస్ట్‌ల పేరుతో ఫోన్ కాల్ వస్తే పోలీసులను సంప్రదించాలన్నారు. ఈ కార్యక్ర మంలో సిబ్బంది వెంకటరమణ శ్రావణి పాల్గొన్నారు.