calender_icon.png 30 December, 2025 | 6:11 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సర్దార్ పాపన్నగౌడ్ విగ్రహ ఆవిష్కరణ

30-12-2025 02:09:22 AM

ఖానాపూర్, డిసెంబర్ 29 (విజయక్రాంతి): జిల్లాలోని మామడ మండలం దిమ్మదుర్తి గ్రామంలో గౌడ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్ర హాన్ని సోమవారం ఆవిష్కరించారు. తుడుం దెబ్బ రాష్ట్ర అధ్యక్షులు అమరవేణి నరస గౌడ్ బీఆర్‌ఎస్ జిల్లా సమన్వయకర్త రామ్ కిషన్ రెడ్డితో పాటు గౌడ సంఘం నాయకులు ఈ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో గౌడ సంఘం నాయకులు శ్రీనివాస్ గౌడ్ దశ గౌడ్, రామగిరి గౌడ్ పాల్గొన్నారు.