calender_icon.png 14 September, 2025 | 12:05 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

డబ్ల్యూటీఐటీసీ జాయింట్ సెక్రటరీగా ప్రణీతా కొట్ల

14-09-2025 12:32:47 AM

హైదరాబాద్, సెప్టెంబర్ 13 (విజయక్రాంతి): ప్రపంచ తెలుగు సమాచార సాంకేతిక మండలి (డబ్ల్యూటిఐటిసి) మహిళా విభాగం ఎన్‌ఆర్‌ఐ జాయింట్ సెక్రటరీగా ప్రణీతా కొట్ల నియామకమయ్యారు. ప్రణీ తా కొట్ల ఇంటెలిజెంట్ ఆటోమేషన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగాల్లో దాదాపు 12 ఏళ్ల అనుభవంతో డిజిటల్ ట్రాన్స్‌ఫార్మేషన్‌కి కొత్త దారులు చూపించిన ట్రయిల్ బ్లేజర్.

ప్రస్తుతం ఈఆర్పీ స్మార్ట్ ల్యాబ్స్‌లో లీడ్ రోబోటిక్ ప్రాసెస్ ఆటోమేషన్ డెవలపర్‌గా పని చేస్తూ, కంపెనీలకు కోట్ల రూపాయ లు ఆదా చేయడంతో పాటు వ్యాపార విధానాలను పూర్తిగా మారుస్తూ పలు విప్లవాత్మ క కార్యక్రమాలకు నాయకత్వం వహించారు. వృత్తి రంగానికి అతీతంగా, ఆమె ఐఈఈఈ నార్త్ కరోలైనా కౌన్సిల్ వైస్ చైర్ గా, అలాగే కరోలైనా ఉమెన్ ఇన్ టెక్ లో టెక్ లీడ్‌గా పనిచేస్తూ మహిళా ప్రొఫెషనల్స్‌కు ప్రోత్సా హం అందించి, రాబోయే తరం నాయకత్వాన్ని తీర్చిదిద్దడంలో కీలక పాత్ర పోషిస్తు న్నారు.

కార్పొరేట్ స్థాయిలకే పరిమితం కాకుండా, ప్రణీతా ప్రభావం ప్రపంచవ్యాప్తంగా విస్తరించింది. ఇప్పటివరకు ఆమె పది కి పైగా అంతర్జాతీయ కాన్ఫరెన్సుల్లో కీనోట్ స్పీచులు ఇచ్చారు. అనేక రిసెర్చ్ పేపర్లు రాశారు.  ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొం దిన తెలుగు వర్గానికి చెందిన ప్రముఖ ప్రొఫెషనల్స్‌లో ఒకరిగా నిలిచారు.

డబ్ల్యూటిఐ టిసి చైర్మన్ సందీప్ కుమార్ మక్తాల మాట్లాడుతూ “ప్రణీతా ఆవిష్కరణను లక్ష్యం తో కలిపిన శక్తికి ప్రతీక. ఆమె కేవలం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇంటెలిజెంట్ ఆటోమే షన్ రంగాలను ముందుకు తీసుకెళ్తున్నది మాత్రమే కాదు. ప్రపంచవ్యాప్తంగా మహిళలు ధైర్యంగా నాయకత్వ బాధ్యతలు స్వీక రించేలా ప్రేరేపిస్తోంది” అన్నారు. డబ్ల్యూటిఐటిసి ఎన్‌ఆర్‌ఐ జాయింట్ సెక్రటరీ (టెక్సాస్, యుఎస్‌ఏ) శ్రీ డి. రామారావు శుభాకాంక్షలు తెలియజేశారు.