calender_icon.png 14 September, 2025 | 8:57 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇబ్రహీంపట్నంలో లోక్ అదాలత్

14-09-2025 12:30:57 AM

హైదరాబాద్, సెప్టెంబర్ 13 (విజయక్రాంతి): రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం కోర్టులో శనివారం జాతీయ మెగా లోక్ అదాలత్‌ను ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి శంకర్ శ్రీదేవి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. క్షణిక ఆవేశానికిలోనై తగాదాలు చేసి కోర్టుకు వచ్చి సమయం వృధా చేసుకోవద్దని, ఆర్థికంగా ఇబ్బంది పడవద్దని, అదేవిధంగా ఆరోగ్యం పాడు చేసుకోవద్దని తెలియజేశారు.

లోక్ అదాలత్‌లో చిన్నచిన్న తగా దాలు రాజీమార్గం ద్వారా పరిష్కరించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో మొత్తం 1,112 సివిల్, క్రిమినల్ కేసులు పరిష్కరించబడినవని తెలియజేశారు. కార్యక్రమంలో అడిషనల్ సీనియర్ సివిల్ జడ్జి రిట లాల్చందు, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ యశ్వంత్ సింగ్, అదనపు జూనియర్ సివిల్ జడ్జి హిమబిందు, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు ముద్దం వెంకటేష్, లీగల్ హెడ్ కౌన్సిల్స్ కె అరుణ్ కుమార్, టి మహేష్, ఏసిపి రాజు తదితరులు పాల్గొన్నారు.