01-09-2025 01:33:08 AM
బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల
హైదరాబాద్, ఆగస్టు 31 (విజయక్రాంతి): సామాజిక రిజర్వేషన్లపై విధించిన 50 శాతం సీలింగ్‌ను ఎత్తివేస్తూ అసెంబ్లీలో పంచాయతీ చట్ట సవరణ బిల్లును ఆమోదించడం అభినందనీయమని బీసీ సంక్షేమ సం ఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్ పేర్కొన్నారు. తెలంగాణ రాష్ర్ట అసెంబ్లీ లో బీసీ రిజర్వేషన్ బిల్లును చట్టం చేసిన సందర్భంగా ఆదివానం అసెంబ్లీ ముందు ఉన్న అమరవీరుల స్థూపం వద్ద ఆయన మీడియాతో మాట్లాడారు.
బీసీ రిజర్వేషన్లను 42 శాతానికి పెంచుతూ తెలంగాణ అసెంబ్లీలో రాష్ర్ట ప్రభుత్వం చట్టం చేయడం అభినందించదగిన విషయమన్నారు. బీసీ రిజర్వేషన్ల పెంపునకు కృషి చేస్తున్న సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పీసీసీ ప్రెసిడెంట్ బొమ్మ మహేశ్ కుమార్ గౌడ్, బీసీ మంత్రులు పొన్నం ప్రభాకర్, కొండ సురేఖ, వాకటి శ్రీహరి, ఆది శ్రీనివాస్‌లకు ధన్యవాదాలు తెలిపారు.
‘బీసీ రిజ ర్వేషన్లను 42 శాతానికి పెంచుతూ చట్టం చేయడానికి అసెంబ్లీలో చర్చలో పాల్గొని మద్దతు తెలియజేసిన బీఆర్‌ఎస్, బీజేపీ, సీపీఐ, ఎంఐఎం పా ర్టీలకు కృతజ్ఞతలు. బీసీ రిజర్వేషన్లపై కేం ద్రం ప్రభుత్వం సహకరించి ఉంటే బీసీల కు ఎప్పుడో న్యాయం జరిగేది. అసెంబ్లీలో చేసిన బీసీ రిజర్వేషన్ల చట్టానికి రాష్ర్ట గవర్నర్ ఆమోదిస్తారని విశ్వసిస్తున్నాం’ అని పేర్కొన్నారు. బీసీ రిజర్వేషన్ల పెంపు చట్టానికి యావత్ తెలంగాణ సమా జం సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
బీసీ రిజర్వేషన్లపై దయ చేసి ఎవరు కోర్టుకు వెళ్లొద్దని, న్యాయస్థానాలను అడ్డం పెట్టుకొని బీసీల నోటికాడ ముద్దను గుంజుకోవద్దని విజ్ఞప్తి చేశారు. బీసీల విషయంలో రాజకీయాలు చేసి, న్యాయస్థానాలను అడ్డం పెట్టు కుని రిజర్వేషన్ల అంశాన్ని రావణకాష్టంలా మార్చేందుకు కారకులెవరో గుర్తించి, వారిని బీసీ ద్రోహులుగా ప్రకటిస్తామని హెచ్చరించారు.
మీడియా సమావేశం లో బీసీ కుల సంఘాల జేఏసీ చైర్మన్ కుం దారం గణేశ్‌చారి, బీసీ యూనిటీ అధ్యక్షుడు ప్రొఫెసర్ చలమల వెంకటేశ్వర్లు, పూలే ఆశ య సాధ న సమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ సం ఘని మల్లేశ్వర్, బీసీ సంక్షేమ సంఘం తెలంగాణ రాష్ర్ట కార్యనిర్వకాధ్యక్షుడు కుల్కచర్ల శ్రీనివాస్ ముదిరాజ్, బీసీ విద్యార్థి సంఘం జా తీయ అధ్యక్షుడు తాటికొండ విక్రమ్ గౌడ్, బీసీ యువజన సంఘం జాతీయ అధ్యక్షుడు కనకాల శ్యామ్ కురుమపాల్గొన్నారు.