12-08-2024 12:40:54 AM
ఏపీ సీఎంను కోరిన స్పీకర్ గడ్డం ప్రసాద్
హైదరాబాద్, ఆగస్టు 11(విజయక్రాంతి): తిరుమల తిరుపతి దేవస్థానంలో వసతి, దర్శనానికి సంబంధించి తెలంగాణ ఎమ్మెల్యేలు చేసే సిఫార్సులకు ప్రాధాన్యం ఇవ్వా లని ఏపీ సీఎం చంద్రబాబును తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ కోరారు. హైదరాబాద్‌లో ఆదివారం చంద్రబాబు నివాసం లో ఆయనను స్పీకర్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా చంద్రబాబుకు స్పీకర్ పుష్పగుచ్ఛం అందజేశారు.
చంద్రబాబును కలిసిన కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడిని కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఆదివారం మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా తిరుమల తిరుపతి దేవస్థానంలో స్వామివారి దర్శనాలకు తెలంగాణ ఎమ్మెల్యేల సిఫారసు లేఖలను పరిగణలోకి తీసుకోవాలని కోరారు. ఇందుకు సీఎం చంద్రబాబు సానుకూలంగా స్పందించారు.