12-08-2024 12:42:38 AM
సంగారెడ్డి, ఆగస్టు 11 (విజయ క్రాంతి): సంగారెడ్డి పట్టణంలో ఆదివారం బీజేపీ యువ మోర్చా ఆధ్వర్యంలో హర్ ఘర్ తిరంగా ర్యాలీ నిర్వహించారు. ప్రధాని పిలు పు మేరకు ఆగస్టు 15న ప్రతిఒక్కరూ తమ ఇళ్లపై, దుకాణ సముదాయాలపై జాతీయ జెండాను ఎగురవేయాలన్నారు. ఈ కార్యక్రమంలో మెదక్ ఎంపీ రఘునందన్‌రావు, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రోహిత్ చాహల్, బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షులు మహిందర్, సంగారెడ్డి జిల్లా బీజేపీ అధ్యక్షురాలు గోదావరి అంజిరెడ్డి, నరేన్‌దేశ్‌పాండే, బీజేపీ నాయకులు కొండాపూరం జగన్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.