12-08-2024 12:38:27 AM
ఏపీ మంత్రి కొల్లు రవీంద్ర
హైదరాబాద్, ఆగస్టు 11 (విజయక్రాంతి): రాష్ట్రంలో మడ అడవుల పెంపకానికి సహకరించాలని కేంద్ర బృందాన్ని కోరినట్టు ఏపీ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. మచిలీపట్నంలో ఆక్వా, మెరైన్ ఫిషింగ్ వర్సిటీ ఏర్పాటు చేయాలని కోరినట్టు చెప్పారు. కృష్ణా జిల్లా గిలకలదిం డిలో ఫిషింగ్ హార్బర్ పనులను కేంద్ర పర్యావరణ, మత్స్యశాఖ అధికారులు ఆదివారం పరిశీలించారు. ఈ సందర్బంగా ఆక్వా, మత్స్య పరిశ్రమ సమస్యలను బృందానికి వివరించారు. అనంతరం మాట్లాడుతూ.. సముద్ర తీరం వెంబడి జాతీయ రహదారి నిర్మించాలని కేంద్ర మంత్రి గడ్కరీని కోరతామని చెప్పారు. మచిలీపట్నం, రేపల్లె మార్గాలను కలపేలా రైల్వేలైన్ కోసం రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ దృష్టికి తీసుకెళ్తామని పేర్కొన్నారు.