calender_icon.png 11 October, 2025 | 10:07 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి

09-10-2025 12:00:00 AM

-ఆర్వో కార్యాలయాల్లో నామినేషన్లు స్వీకరణ

-నామినేషన్ కేంద్రాల్లో హెల్ప్ డెస్క్‌లు 

-కలెక్టర్ అభిలాష అభినవ్ 

నిర్మల్, అక్టోబర్ 8 (విజయక్రాంతి): జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల స్వీకరణ ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కౌమిదిని అన్నారు. బుధవారం రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కౌమిదిని అన్ని జిల్లాల కలెక్టర్లతో మొదటి విడత జెడ్పీటీసీ, ఎంపీటీసీ నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ, ఎన్నికల నోటిఫికేషన్ అంశాలపై వీడియో కాన్ఫరెన్స్ సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ అభిలాష అభినవ్ మాట్లాడుతూ.. జిల్లాల్లో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నిర్వహణకు అన్ని ఏర్పాట్లను పూర్తి చేశామని అన్నారు. మొదటి విడతలో భాగంగా రేపటి ప్రారంభం కానున్న నామినేషన్ల స్వీకరణ ప్రక్రియకు తగిన ఏర్పాట్లు అన్ని పూర్తి చేశామని అన్నారు. జిల్లాలో మొదటి విడతలో భాగంగా తొమ్మిది జెడ్పీటీసీ, 75 ఎంపీటీసీ స్థనాలకు సంబంధించి ఎన్నికల నిర్వహణ ప్రక్రియలో భాగంగా రేపటి నుంచి 11వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరించనున్నట్లు చెప్పారు.

నామినేషన్లు స్వీకరించే ఆర్వో కార్యాలయాల్లో అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు పేర్కొన్నారు. పటిష్ట పోలీసు బందో బస్తు ఏర్పాటు చేస్తామని వివరించారు. ఎఫ్‌ఎస్టీ, ఎస్‌ఎస్టి, విఎస్టీ బృందాలు సమర్థవం తంగా పనిచేస్తున్నాయని తెలిపారు. ఆర్వో, ఏర్వోలకు ఇప్పటికే పలుమార్లు శిక్షణ కార్యక్రమాలు నిర్వహించామన్నారు. అనంతరం ఎంపిడిఓలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడుతూ, రేపటి నుంచి ప్రారంభం కానున్న మొదటి విడత జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నామినేషన్ల స్వీకరణ పకడ్బందీగా నిర్వహించాలని ఆదేశించారు.

అన్ని నామినేషన్ స్వీకరణ ప్రక్రియను మొత్తం ఖచ్చితంగా వీడియో రికార్డింగ్ చేయాలన్నారు. మొదటి విడతలో భాగంగా రేపటి నుంచి 11వ తేదీ వరకు, ఉదయం 10.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్లు స్వీకరించాలని చెప్పారు. 12 వ తేదీన నామినేషన్ల పరిశీలన, 15 వ తేదీన నామినేషన్ల ఉపసంహరణ, 23 తేదీన ఉదయం 7 గంటల నుంచి సాయం త్రం 5 గంటల వరకు పోలింగ్, వచ్చేనెల 11 వ తేదీన ఫలితాలు ఉంటాయని చెప్పారు.

నామినేషన్ కేంద్రాల్లో హెల్ప్ డెస్క్‌లు ఏర్పా టు చేసి, అన్ని ఫారములు అందుబాటులో ఉంచాలని వివరించారు. జెడ్పీటీసీ, ఎంపీటీసీ నామినేషన్ల స్వీకరణకు వేరు వేరు గదులు ఏర్పాటు చేయాలన్నారు. ప్రతి రోజు నామినేషన్ల వివరాల నివేదికలు తమకు అందజేయా లని తెలిపారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో అదనపు కలెక్టర్ లు ఫైజాన్ అహ్మద్, కిషోర్ కుమార్, ఏఎస్పీ ఉపేంద్రా రెడ్డి, ఆర్డీవో రత్నకళ్యాణి, జెడ్పీ సీఈవో గోవింద్, డిపిఓ శ్రీని వాస్, డీపీఆర్వో విష్ణువర్ధన్, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.