calender_icon.png 11 October, 2025 | 3:44 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సీజేఐపై దాడి..రాజ్యాంగంపై దాడే

09-10-2025 12:00:00 AM

దాడిని ఖండిస్తూ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంఘాల నిరసన

ఆదిలాబాద్, అక్టోబర్ 8 (విజయక్రాంతి) : సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి భూష ణ్ రామకృష్ణ గావాయ్‌పై దాడికి ప్రయత్నించడం రాజ్యాంగంపై దాడి చేయడమే అని ఎస్సీ, ఎస్టీ, బీసీ సంఘాల నాయకులు అన్నారు. దాడి ఘటనను ఖండిస్తూ స్థానిక అంబేద్కర్ చౌక్ లో ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ సంఘాలు బుధవారం భారీ నిరసన చేపట్టారు. ముందుగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

నంతరం నల్ల బ్యాడ్జి లు ధరించి నినాదాలతో హోరెత్తించారు.ఈ సందర్భంగా భారతీయ బౌద్ధ మహాసభ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రజ్ఞా కుమార్, మాల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు కొప్పుల రమేష్ మాట్లాడుతూ... దాడికి యత్నించిన లాయర్ కిషోర్‌కు ఉరిశిక్ష వెయ్యాలని డిమాండ్ చేసారు. ఈ కార్యక్రమంలో ఆయా సంఘాల నేతలు మేకల మల్లన్న, దయానంద్, యూనుస్ అల్బానీ, నసిర్ హమ్మద్, వాగ్మారే కాంతారావు, భీం రావ్ వాగ్మారే, సత్యవన్ చిక్టే, ఖుషివార్త లాం డిగే,  ఉజ్వల ధుడే, మాయవాతి ససానే, ఉదయ్ కుమార్, రాజు మాస్క్, గంగారాం బోరెకర్ తదితరులు పాల్గొన్నారు.