calender_icon.png 11 October, 2025 | 4:32 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భార రహిత విద్యావ్యవస్థ జాతీయ సదస్సుకు యాపర్ల ఉపాధ్యాయుడు

09-10-2025 12:00:00 AM

ఉపాధ్యాయుడు మురళీకృష్ణకు అభినందనలు

పెబ్బేరు, అక్టోబర్ 8 : నేడు గుజరాత్ రాష్ట్ర రాజధాని గాంధీ నగర్ లో జరిగే జాతీయ విద్యా సదస్సు కు యాపర్ల ఉపాధ్యాయుడు మురళీ కృష్ణ హాజరు కానున్న నేపథ్యంలో జిల్లా విద్యాశాఖ అధికారి అబ్దుల్ ఘని, ప్రధానోపాధ్యాయులు ఉస్సేన్, గ్రామస్తులు బుధవారం అభినందించారు. విద్యార్థుల పుస్తకాల బ్యాగు బరువు తగ్గించే ప్రయత్నం, నాణ్యమైన విద్య కోసం సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది.

జాతీయ ఉపాధ్యాయ శిక్షణా సంస్థ ఆధ్వర్యంలో గుజరాత్ లో ఏర్పాటు చేసిన సదస్సు కు తెలంగాణ రాష్ట్రం నుంచి నలుగురు ఉపాధ్యాయులు ఎంపిక అయ్యారు. మన స్థానిక సంస్కృతి, సాంప్రదాయ పద్ధతిలో వృత్తి విద్యా తరహా నూతన వరవడిలో భోధన మంచి ఫలితాలు వస్తాయి అనే అంశం పై ఉపాధ్యాయుడు మురళీ కృష్ణ పరిశోధన పత్రం సదస్సు లో సమర్పించనున్నారు. ఈయన ఎంపిక పట్ల జిల్లా విద్యాశాఖ అధికారి అబ్దుల్ ఘని, ఎంఈవో జయరాములు, ప్రధానోపాధ్యాయులు హుస్సేన్, ఎస్సీ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు భాగ్య లక్ష్మి, లతో పాటు గ్రామస్తులు అభినందించారు.