calender_icon.png 17 August, 2025 | 5:43 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రంగస్థలం సీక్వెల్‌కు సన్నాహాలు

17-08-2025 01:00:24 AM

రామ్‌చరణ్ ఖాతాలో ఎన్ని విజయవంతమైన చిత్రాలున్నా నటన పరంగా ఆయనకు అన్నివర్గాల నుంచి మంచి మార్కులు పడ్డది మాత్రం ‘రంగస్థలం’మే. ఈ సినిమాకు రామ్‌చరణ్‌కు నేషనల్ అవార్డు వస్తుందని అంతా భావించారు. కానీ అది జరగలేదు. అప్పటివరకున్న తెలుగు సినిమా రీజనల్ రికార్డులను బద్దలు కొట్టిందీ ‘రంగస్థలం’. అలాంటి ఈ సినిమాకు సంబంధించి తాజాగా టాలీవుడ్‌లో ఓ ఆసక్తికర వార్త వైరల్ అవుతోంది.

సుకుమార్ తర్వాతి సినిమా రామ్‌చరణ్‌తో అన్న సంగతి అందరికీ తెలిసిందే. ఇప్పటికే అధికారిక ప్రకటన కూడా చేసేశారు. చరణ్ ప్రస్తుతం బుచ్చిబాబుతో చేస్తున్న ‘పెద్ది’ పూర్తవగానే సుకుమార్ మొదలుపెట్టనున్నారు. తాజా సమాచారం ప్రకారం సుకుమార్‌కు ‘రంగస్థలం 2’ చేస్తున్నారట.

ఇప్పటికే తన శిష్యబృందంతో కలిసి ఈ సినిమా స్క్రిప్ట్ వర్క్ మొదలుపెట్టారని టాక్. త్వరలోనే చరణ్‌కు ఈ స్టోరీ ఐడియాను వివరిస్తారట. ఒకవేళ నిజంగానే సుకుమార్‌ెేరామ్‌చరణ్ కలిసి రంగస్థలం సీక్వెల్ చేస్తే ఈ సారి పాన్ ఇండియా వైడ్ మాస్ హిట్ అవ్వడమే కాక, చరణ్ పక్కా జాతీయ పురస్కారం వస్తుందని అభిమానులు భావిస్తున్నారు.