17-08-2025 05:21:58 PM
సదాశివనగర్,(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా సదాశివ నగర్ మండలంలోని ఉత్తునూరు గ్రామంలో శ్రీకృష్ణ జన్మాష్టమి పురస్కరించుకొని ఆదివారం గ్రామంలోని హనుమనుమందిరము నుండి ప్రధాన వీధులగుండా ఉరేగిప్పుగా వెళ్లి అంగడి బజారులో యాదవ యూత్ ఆధ్వర్యములో ఏర్పాటు చేసిన ఉట్టిని కొట్టారు. కండెరాయ ఆలయములో గ్రామ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యములో ఏర్పాటు చేసిన ఉట్టిని గ్రామ యువకులు పగలకొట్టారు. ఉట్టి కొట్టిన వారికి నగదు బహుమతిని యాదవ యూత్ 2000 రూపాయలు,వీడీసీ కమిటీ 5000 రూపాయలను అందిoచారు.