calender_icon.png 16 August, 2025 | 5:46 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కాక్‌టెయిల్ సీక్వెల్‌లో..

16-08-2025 12:26:44 AM

బాలీవుడ్ భామ కృతి సనన్ ప్రస్తుతం వరుస సినిమాలు ప్రకటిస్తూ కెరీర్‌లో వేగంగా దూసుకెళుతోంది. ఇటీవలే ‘తేరే ఇష్క్ మే’ షూటింగ్ పూర్తి చేసిన ఈ ముద్దుగుమ్మ తాజాగా మరో చిత్రంలో నటించేందుకు సిద్ధమైనట్టు తెలుస్తోంది. 2012లో వచ్చిన ‘కాక్‌టెయిల్’ బ్లాక్‌బస్టర్ హిట్ అందుకుంది. ఇప్పుడు దీనికి సీక్వెల్ రానుంది.

షాహిద్ కపూర్ కథానాయకుడిగా నటించనున్న ఈ ‘కాక్‌టెయిల్2’కు హోమీ అడాజానియా దర్శకత్వం వహిస్తారని, ఆగస్టు ఆఖరి వారం నుంచి ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుందనేది ప్రస్తుతం బీ టౌన్‌లో జోరుగా వినవస్తున్న టాక్. ఈ క్రమంలోనే మేకర్స్ ఈ సినిమాలో కథానాయికగా కృతి సనన్‌ను ఓకే చేశారట.

ఇప్పటికే కథ విన్న కృతి.. ఈ ప్రాజెక్టులో భాగమయ్యేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని సమాచారం. హిట్ రొమాంటిక్ కామెడీ చిత్రంగా ప్రేక్షకాదరణ పొందిన ‘కాక్‌టెయిల్’ సీక్వెల్‌లో కృతి నటించనుందని తెలిసి అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇది నిజమైతే గనుక బాలీవుడ్‌లో తన జోరు తగ్గలేదని కృతి మరోమారు నిరూపించినట్టవుతుంది.