calender_icon.png 17 August, 2025 | 6:50 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

327 (INTUC అనుబంధ కార్మిక సంఘం) నుండి టిఆర్వీకేఎస్ లో భారీ చేరికలు

17-08-2025 05:29:35 PM

భద్రాద్రి కొత్తగూడెం,(విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలోని కేటీపీఎస్ కరమాగారంలో పనిచేస్తున్న కార్మికులు ఇతర సంఘాల నుంచి ఆదివారం టి ఆర్ వి కే ఎస్ కార్మిక సంఘంలో చేరారనీ టిఆర్వికెఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చారు గుండ్ల రమేష్ తెలిపారు. వారిని సభ్యత వచ్చి సంఘంలోకి ఆహ్వానించినటు తెలిపారు. సంఘంలో చేరిన వారి వివరాలు  కేటీపీఎస్ ఏడోదశ రీజనల్ అధ్యక్షులుగా పనిచేస్తున్న కే.బిక్షపతి, కోశాధికారిగా బాధ్యతలు నిర్వహిస్తున్న ఎస్ సత్తయ్య,  సి హెచ్ పి బ్రాంచ్ అధ్యక్షులు ఎస్.కె బాబుమియా , పి  రాములు, జి. వీరభద్రం, జి సత్యం, ఎస్.కె హుస్సేన్, జె శ్రీను, పి మనోహర్రాజు, కే సురేష్ , బి జగపతి, తదితరులు ఉన్నారు.