17-08-2025 04:43:34 PM
మహబూబాబాద్ (విజయక్రాంతి): భార్య కాపురానికి రావడం లేదని మనస్థాపానికి గురైన ఓ వ్యక్తి రైలు కిందపడి ఆత్మహత్య చేసుకోవడానికి యత్నించగా అందించిన బ్లూ కోట్ పోలీసులు స్పందించడంతో ఆ వ్యక్తి ప్రాణాలతో బయటపడ్డ ఘటన మహబూబాబాద్ జిల్లా(Mahabubabad District) కేసముద్రం పట్టణంలో జరిగింది. మహబూబాబాద్ కు చెందిన బండి బాలు అనే వ్యక్తి కేసముద్రం రైల్వే స్టేషన్ లో రైలు కిందపడి ఆత్మహత్య చేసుకుంటున్నట్లు 100కు డయల్ చేసి చెప్పాడు. వెంటనే స్పందించిన బ్లూ కోట్ సిబ్బంది ఏండీ అలిమ్, రామకృష్ణ స్పందించి వెంటనే సంఘటన స్థలికి చేరుకొని రైలు పట్టాలపై పడుకున్న బాలును అక్కడనుంచి తీసుకువచ్చి పోలీస్ స్టేషన్కు తీసుకువెళ్లారు. అనంతరం అతని సమస్యను అడిగి తెలుసుకోగా, తన భార్య కాపురానికి రావడం లేదని చెప్పడంతో, ఆమెతో ఫోన్లో మాట్లాడి సమస్య పరిష్కారానికి తాము కృషి చేస్తామని చెప్పి బాలు సమీప బంధువుకు సమాచారం ఇచ్చి అతనికి అప్పగించారు.