17-08-2025 05:33:03 PM
నకిరేకల్,(విజయక్రాంతి): గ్రామీణ ప్రాంతాల్లో లయన్స్ క్లబ్ స్వచ్ఛందంగా ఏర్పాటు చేస్తున్న వైద్య సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని శాలిగౌరారం సర్కిల్ ఇన్స్పెక్టర్ కె. కొండల్ రెడ్డి అన్నారు.లయన్స్ క్లబ్ అఫ్ కట్టంగూర్ కింగ్స్ ఆధ్వర్యంలో సూర్యాపేట లయన్స్ కంటి ఆసుపత్రి వారి సహకారంతో కట్టంగూర్ మండలం లోని ఈదులూరు గ్రామంలో ఉచిత కంటి వైద్య శిబిరాన్ని ఆదివారం నిర్వహించారు. ఈ వైద్య శిబిరంను సీఐ కొండల్ రెడ్డి సూర్యాపేట కంటి ఆసుపత్రి ఛైర్మెన్, మాజీ ఎమ్మెల్యే దోసపాటి గోపాల్ తో కలిసి ప్రారంభించారు.
ఈ సందర్బంగా సీఐ కొండల్ రెడ్డి మాట్లాడుతూ... అన్ని వర్గాల ప్రజకలకు సేవలు అందిచడంలో లయన్స్ క్లబ్ లు ముందండం అభినందనీయమన్నారు.మాజీ ఎమ్మెల్యే దోసపాటి గోపాల్ మాట్లాడుతూ తమ హాస్పిటల్ ఆధ్వర్యంలో లో ఎంతో మంది పేద వారికి ఉచితంగా కంటి ఆపరేషన్లు చేస్తున్నామని చెప్పారు. గ్రామీణ ప్రాంతాల్లో కంటి సమస్యలతో బాధ పడుతున్నావారు క్లబ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసి కంటి వైద్య శిబిరం లో పాల్గొని చికిత్సలు చేయించుకోవాలని కోరారు. ఈ వైద్య శిబిరం లో 150 మందికి కంటి పరీక్షలు నిర్వహించి 25 మందికి ఆపరేషన్ చేయడానికి గుర్తించి సూర్యాపేట ఆసుపత్రి తీసుకువెళ్లారు.