calender_icon.png 5 November, 2025 | 6:09 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన కుటుంబాలకు ఆర్థిక సహాయం పంపిణీ..

05-11-2025 04:30:12 PM

అనాధలైన పిల్లలకు అన్ని విధాలుగా అండగా ఉంటా.. ఎమ్మెల్యే

తాండూరు (విజయక్రాంతి): చేవెళ్ల రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన కుటుంబాలకు బుధవారం తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి, అడిషనల్ కలెక్టర్ సుధీర్, సబ్ కలెక్టర్ ఉమా శంకర్ ప్రసాద్, RTC RM శ్రీలత, డిప్యూటీ ఆర్ఎం సరస్వతి, తాండూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బాల్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ప్రముఖ వైద్యులు డాక్టర్ సంపత్ కుమార్ తో కలిసి రూ 7 లక్షల చొప్పున, 13 కుటుంబాలకు చెక్కులను పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి మాట్లాడుతూ చేవెళ్ల దుర్ఘటన బాధాకరమని ఒకే కుటుంబంలో పేర్కొంపల్లి గ్రామానికి చెందిన ముగ్గురు అక్క చెల్లెలు మృతి చెందడం తనను తీవ్రంగా కలచి వేసిందని... తల్లితో పాటు 40 రోజుల పసికందు మరణించడం నియోజకవర్గంలో తీవ్ర విషాదాన్ని నింపిందని అన్నారు. యాలాల్ మండలం హాజీపూర్ గ్రామానికి చెందిన కురుగంట బందప్ప, లక్ష్మీ దంపతులు మృతిచెందడంతో వారి ఇంటికి వెళ్ళి పరామర్శించి, ప్రభుత్వం తరపున ప్రకటించిన రూ.7 లక్షలు, ఇద్దరికి గాను రూ.14 లక్షల విలువ గల చెక్కులను అందించారు. అనాథలైన ఇద్దరు పిల్లలను చదివించే బాధ్యత తీసుకుంటానని అంతేకాకుండా ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేసి కట్టిస్తామని హామీ ఇచ్చారు. ఇంకా ఈ కార్యక్రమంలో యాలాల, తాండూర్ తహసీల్దారులు స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.