సీబీఐపై ఒత్తిడి పెంచాలి
- కాళేశ్వరం ప్రాజెక్ట్‌పై విచారణకు సీబీఐ డైరెక్టర్‌కు లేఖ రాయాలి
- సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశం
హైదరాబాద్, ఏప్రిల్ 27 (విజయక్రాంతి): కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణకు ఒత్తిడి పెంచాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. న్యాయ నిపుణుల సూచనల మేరకు ప్రాజెక్టుకు సంబంధించిన అంశాలపై తక్షణమే వి చారణ చేపట్టాలని కోరుతూ సీబీఐకి లేఖ రాయాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధికారులను అదేశించారు.
అవసరమైతే సీబీఐ డైరెక్టర్ అపాయింట్మెంట్ తీసుకుని, నేరుగా కలిసి వినతిపత్రం సమర్పించాలని మంత్రులకు సూచించారు. కాళేశ్వరంపై ఇటీవల హై కోర్టు తీర్పు నేపథ్యంలో తదుపరి చేపట్టాల్సిన చర్యలపై సీఎం రేవంత్‌రెడ్డి, నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి ఉన్నత స్థా యి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సుప్రీంకోర్టు ప్రముఖ న్యాయ నిపుణులు అభిషేక్ సింఘ్వీతో చర్చించి ప్రభుత్వం అనుసరించాల్సిన ప్రణాళికను నిర్దేశించారు.






