తెలంగాణ రాష్ట్ర కలను నెరవేర్చిన బీఆర్‌ఎస్
మున్సిపల్ చైర్ పర్సన్ చందన రవీందర్
గజ్వేల్ ఏప్రిల్ 27: గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ తో పాటు నియోజకవర్గ వ్యాప్తంగా బిఆర్‌ఎస్ ఆవిర్భావ దినోత్సవాన్ని పార్టీ శ్రేణులు ఘనంగా జరుపుకున్నాయి. మున్సిపల్ చైర్పర్సన్ గంగిశెట్టి చందన రవీందర్ 19 వార్డులో జండా ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు. మాజీ సీఎం కేసీఆర్ సారధ్యంలో ప్రజా ఉద్యమాలతో తెలంగాణ పోరాటాన్ని చేసి రాష్ట్రాన్ని సాధించిన ఘనత బిఆర్‌ఎస్ పార్టీ దేనన్నారు.
గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ తో పాటు రాష్ట్రాన్ని బిఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో మాజీ సీఎం కేసీఆర్ అద్భుతంగా అభివృద్ధి చేశారన్నారు. తమ పాలకవర్గ సహకారంతో మున్సిపాలిటీ మరింత అభివృద్ధి చేస్తామన్నారు. కార్యక్రమంలో నాయకులు ఆర్కే శ్రీనివాస్, ఆకుల దేవేందర్, సిరాజ్, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. మున్సిపాలిటీలోని అన్ని జెండా కార్యక్రమాలలో చైర్పర్సన్ పాల్గొన్నారు.






