23-07-2025 12:29:26 AM
చెప్పేదొకటి.. వసూలు చేసేదోకటి
కామారెడ్డి, జూలై 22 (విజయక్రాంతి): సామాన్యులనే అస్త్రంగా చేసుకొని కొందరు, కొన్ని ప్రైవేటు ఫైనాన్సు సంస్థలు రెచ్చిపోతున్నారు. గ్రామాల్లోకి వచ్చి రుణా లు ఇస్తామంటూ తిరుగుతున్నారు. పెంకు టిల్లు, రేకుల షెడ్డు ఉన్నా రుణాలు ఇస్తామం టూ నమ్మ బలుకుతున్నారు. రుణాలు తీసుకున్న తర్వాత పిడిస్తున్నారు. సక్రమంగా నెలసరి కిస్తీలు చెల్లించని వారి పై బెదిరింపు లకు పాల్పడుతున్నారు.
పెంకుటిల్లు మీద సుమారు 3 నుంచి 4 లక్షల వరకు, రేకుల ఇంటికి 3 లక్షలు, స్లాబ్ ఉన్న ఇంటికి 8 లక్షల వరకు రుణాలు ఇస్తామంటూ గృహ లపై రుణాలు ఇచ్చే వారు తిరుగుతున్నారు. రుణాలు తీసుకునేంత వరకూ సులభమైన పద్దతి అంటూ అక్కడే లాగిన్ పూర్తి చేసి ఖాతాలో డబ్బులు జమ చేస్తున్నారు. అయితే నెలనెలా తిరిగి చెల్లించే కిస్తీ డబ్బుల సమయంలో చెల్లించాల్సిన దాని కంటే అధిక మొత్తంలో డబ్బులు వసూలు చేస్తున్నారు.
రుణం పొందే వరకు మాయ మాటలతో మభ్యపెడుతున్నారు. ఒకసారి రుణం మంజూరు అయిందంటే తిరిగి నెల నెలా చెల్లించాల్సిన డబ్బులకు రెండింతలు వసూలు చేస్తున్నారు. అయితే ఒక నెల కిస్తీ చెల్లించకపోయినా ససేమీరా అంటూ మొండిగా ఇళ్లలోకి చొరబడినంత పని చేస్తున్నారు. రుణం ఇచ్చే సమయంలో తక్కువ వడ్డీనే అంటూ చెప్పి రుణం పొందిన తరువాత ఎక్కువ మొత్తంలో వడ్డీ వసూలు చేస్తూ సామాన్య, మద్యతరగతి వారి రక్తాన్ని పిండేసిన విధంగా వ్యవహరి స్తున్నారు. దీంతో సామాన్యులు మధ్య తరగతి ప్రజలు ప్రాణాలు కోల్పోతు న్నారు.
పరువు పోతుందని ఫైనాన్స్ వేధింపుల వల్ల ప్రాణా లు కోల్పోతున్న సంఘటనలు కామారెడ్డి జిల్లాలో ఇప్పటివరకు నలుగురు ఆత్మహత్య చేసుకున్నారు. అయినా ఫైనాన్స్ వల్ల ఆగడాలు ఆగలేకపోతున్నాయి. అరికట్టాల్సిన పోలీసులు ప్రేక్షక పాత్ర వహిస్తున్నారు. దీంతో ఫైనాన్స్లా వారు రెచ్చిపోతున్నారు. నెల నెల మామూలు ఇచ్చి ఆగడాలు సాగిస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి.
ఆర్బీఐ అనుమతులు ఉన్నాయంటూ బెదిరింపులు..
కామారెడ్డి జిల్లా కేంద్రం లో అనేకమైన ప్రైవేటు ఫైనాన్స్ సంస్థలు నెలకొల్పారు. పేదొళ్ల డబ్బుల అవసరాన్ని ఆసరగా చేసుకొని వారి జీవితాలతో చలగాటం ఆడుతున్నారని పలువురు బాదితులు పేర్కొంటున్నారు. కామారెడ్డి చుట్టు పక్కల గ్రామీణ ప్రాంతాలను లక్ష్యంగా చేసుకొని ఫైనాన్సు సంస్థలు రెచ్చిపోతున్నాయి. దీంతో ఎక్కడ అప్పు పుట్టే పరిస్థితి లేకపోవడంతో సామాన్య, మద్యతరగతి కుటుంబాలు ప్రైవేటు సంస్థలను ఆశ్రయిస్తున్నారు.
ఇదే అదునుగా భావించి సదరు బాదితుల నుంచి పెద్ద మొత్తంలో వడ్డీని వసూలు చేసేలా పంజా విసురుతున్నారు. ఒక్క నెల చెల్లించకపోయినా బెదిరింపులకు గురి చేస్తున్నారు. అలాగే ఇంటి తాళాలు వేసి జప్తు చేస్తామని బెదిరింపులకు పాల్పడుతున్నారు. అయితే రుణం ఇచ్చే సమయంలో ఇవేమి చెప్పకుండా సంతకాలు పెట్టించుకుంటు న్నారు.
ఆ తరువాత మా వద్ద అన్నీ లీగల్ గా ఉన్నాయని మీరు ఎక్కడికి వెళ్లినా మమ్ములను ఎవరూ ఏమి చేయలేరంటూ మాట్లాడుతున్నారని వాపోతున్నారు. అలాగే కొందరి ఇంటి మీద తీసుకున్న రుణాలకు సంబందించి ఒకటి, రెండు నెలలు కిస్తీ డబ్బులు చెల్లించకపోతే ఆ ఇంటిపై రంగు పూసి తమ ఆధీనంలో ఉందని రాస్తున్నారని పేర్కొంటున్నారు. ఇదిలా ఉంటే అవసర మైతే ఇంటి నుంచి గెంటేసి ఇల్లును జప్తు చేసుకునే హక్కు మాకు ఉందంటూ బెదరిం పులకు దిగడంతో లబ్దిదారులు ఆందోళనకు గురవుతున్నారు.
ఎంతో మానసిక ఆవేదనకు గురవుతున్నారు. అయితే ప్రైవేటు ఫైనాన్సు వ్యాపారులు ముక్కు పిండి మరీ వడ్డీ రూపంలో రెండింతలు వసూలు చేస్తున్నారని పలువురు బాదితులు తమ గోడును వెలిబుచ్చుతున్నారు. ఇటువంటి ప్రైవేటు ఫైనాన్సు లపై ప్రభుత్వం ప్రత్యేక నజర్ పెట్టాలని లేకుంటే పరిస్థితి ఆందోళనంగా మారే అవకాశం ఉంటుందని వాపోతున్నారు.
అసలే పంటలు సాగు చేసే కాలం
ప్రస్తుతం వర్షాకాలం కావడం.. రైతులు పంటలు సాగు చేసే కాలం, అలాగే కూలీ నాలి చేసుకునే సమయంలోనూ ఫైనాన్స్ వారు వదలడం లేదు. పంట డబ్బులు వచ్చిన తరువాత మొత్తం చెల్లించి క్లియర్ చేస్తామని చెప్పినా వినడం లేదంటూ వాపోతున్నారు. ఇదే కాకుండా ఫోన్లు చేస్తూ బెదిరింపులకు గురి చేయడంతో రుణం పొందిన వారు ఉలికిపడాల్సిన పరిస్థితి నెలకొంది.
ఇవన్నీ చెప్పకుండా సామాన్య ప్రజలతో ముందుగానే అన్ని ఒప్పందాల పత్రాలపై సంతకాలు చేయించుకొని ఇటువంటి భయాందోళనలకు పాల్పడుతు న్నారని వాపోతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం ఈ ప్రైవేటు ఫైనాన్సు లను కట్టడి చేయాలని లేకుంటే మద్యతరగతి, సామాన్య ప్రజలు గోస పడక తప్పదని పేర్కొంటు న్నారు.
వేధిస్తే ఫిర్యాదు చేయండి
కామారెడ్డి జిల్లా కేంద్రంలో ప్రవేట్ ఫైనాన్సులు వేదిస్తే తమకు ఫిర్యాదు చేయాలని కామా రెడ్డి పట్టణ సీఐ నర హరి తెలిపారు. ఫైనాన్స్ వారి వేధింపులు తమ దృష్టికి రాలేదని తెలిపారు. ఫైనాన్స్ వారు వేధింపుల కు పాల్పడితే చర్యలు తీసుకుంటాం.
నరహరి, పట్టణ సీఐ, కామారెడ్డి,