23-07-2025 12:44:01 AM
ఫార్మాసిస్ట్ లేకుండానే నిర్వాహణ
అధిక ధరలకు మందుల అమ్మకాలు
ఘట్ కేసర్, జూలై 22 : కేంద్ర, రాష్ట్ర ప్ర భుత్వాలు ప్రజల ఆరోగ్యం కోసం అనేక సం క్షేమ కార్యక్రమాలను ప్రవేశపెడుతుంటే అ మలు చేయాల్సిన అధికారులు నిర్లక్ష్యం వ హిస్తున్నారు. కొంత మంది వైద్యులు ఆస్పత్రులను అనుసంధానం చేసుకొని రోగుల ను దోపిడీకి గురిచేస్తున్నారు. ఇదే అదనుగా భావించిన పలువురు మెడికల్ దుకాణాల నిర్వాహకులు రోగుల జీవితాలతో ఆటలాడుకుంటుంన్నారు.
నిబంధనలకు విరుద్ధం గా దుకాణాలు ఏర్పాటు చేసుకొని బినామీ కంపనీలకు చెందిన మందులు అత్యధిక ధరలకు విక్రయిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇలాంటి మెడికల్ దుకాణాలపై నిఘాపెట్టి వారి ఆగడాలను అరికట్టాల్సిన ఔషధ ని యంత్రణ శాఖ అధికారులు నిర్లక్ష్యం ప్రదర్శించడం విమర్శలకు తావిస్తుంది. మెడికల్ నిర్వాహకుల నుండి నెలవారిగా మామూళ్లు తీసుకొని చూసిచూడ నట్లుగా వ్యవహరిస్తున్నారనే ప్రచారం జరుగుతుంది.
నిబంధనలకు నీళ్లు...
ఉమ్మడి ఘట్ కేసర్ మండలంలో ఉన్న మెడికల్ దుకాణాల్లో చాలా వరకు నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్నట్లు సమాచా రం. అర్హుడైన ఫార్మసిస్ట్ లేకుండా మెడికల్ షాపు నిర్వహించరాదు. సంబంధిత ఫార్మాసిస్ట్ తెల్లకోటు ధరించి మెడికల్ షాపును నడిపించాలని నిబంధనలు చెబుతున్నాయి. కానీ ఇక్కడ ఇంటర్ పూర్తి చేసిన వారికి కొందరికి తెల్లకోటు వేసి, మరికొందరు తెల్లకోటు వేయకుండానే దుకాణాలను నిర్వహి స్తున్నారు.
అదే విధంగా నిర్దేశించిన కొలతల ప్రకారం గాలి, వెలుతురు వచ్చేలా దుకాణం ఏర్పాటు చేసుకోవాలి. ఖచ్చితంగా షాపులో రిఫ్రిజిరేటర్, ఏసీ కలిగి ఉండాలి. వీటన్నిటితో పాటు సర్టిఫికెట్ కలిగి ఉన్న వ్యక్తులకు ఔషద నియంత్రణ శాఖ అధికారులు మెడికల్ షాపు నిర్వహించేందుకు లైసెన్స్ జారీ చేస్తారు.
అధిక ధరలకు విక్రయాలు...
నిబంధనలకు విరుద్ధంగా మెడికల్ దుకాణాలు నిర్వహిస్తున్న వ్యక్తులు అధిక ధరలకు మందులు విక్రయిస్తూ రోగుల జేబులకు చిల్లులు పెడుతున్నట్లు తెలుస్తుంది. బినామీ, లోకల్ కంపనీల మందులు అమాయక రోగులకు కట్టబెట్టి నిలువునా దోచుకుంటున్నారు.