calender_icon.png 23 July, 2025 | 6:54 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మహాలక్ష్మీ.. మరో మైలురాయి

23-07-2025 12:04:41 AM

  1.    20 నెలల్లో 200 కోట్ల మంది మహిళల ఉచిత ప్రయాణం
  2. మహాలక్ష్మి పథకం సూపర్ సక్సెస్  
  3. నేడు రాష్ట్ర వ్యాప్తంగా సంబురాలు
  4. రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ 

హైదరాబాద్, జూలై 22 (విజయక్రాంతి): తెలంగాణ ఆర్టీసీ అరుదైన రికార్డును సొంతం చేసుకుంది. రాష్ర్ట ప్రభుత్వం అమలు చేసిన మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం.. మహాలక్ష్మి పథకంలో  ఏకంగా 200 కోట్ల జీరో టికెట్లు జారీ చేసింది. ఏడాదిన్నర పాలనలో మహిళల సంక్షేమం, మహిళా సాధికారతకు పెద్దపీట వేస్తున్నామని చెప్తున్న సర్కారు... ఇది తమ ప్రభుత్వ విజయంగా పేర్కొంది.

ఈ మేర కు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మంగళవారం ఒక ప్రకటనలో వెల్లడించారు. ప్రజా ప్రభుత్వం మహిళకు ఇచ్చిన మాట నిలబెట్టుకుందని, ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచిత ప్రయాణ పథకాన్ని విజయవంతంగా అమలు చేసిందన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి సారథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం బాధ్యతలు చేపట్టి న 48 గంటల్లోనే డిసెంబర్ 9వ తేదీన అమ లు చేసిన ఈ పథకం దేశం దృష్టిని ఆకర్షించిందని తెలిపారు.

ఇప్పటివరకు 200 కోట్ల ఉచిత టికెట్లు జారీ అయ్యాయని వెల్లడించారు. జీరో టికెట్లు పొంది ఉచిత ప్రయాణ సదుపాయా న్ని వినియోగించుకోవటంతో 20 నెలల్లోనే తెలంగాణ ఆడబిడ్డలు రికార్డు మొత్తంలో రూ.6,700 కోట్లు ఆదా చేసుకున్నారని ఆయ న తెలిపారు. తెలంగాణ ఆర్టీసీకి మహిళా ప్ర యాణికుల రీయింబర్స్‌మెంట్‌ను ప్రభుత్వం ఎప్పటికప్పుడు చెల్లిస్తున్నట్లు పేర్కొన్నారు.

స్కీమ్ ప్రారంభమైన తొలి రోజుల్లో రోజుకు సగటున 14 లక్షల మంది మహిళలు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించారని, ఆ తర్వాత మహిళా ప్రయాణికుల సంఖ్య రోజు రోజుకు పెరిగి ఇప్పుడు సగటున రోజుకు 30 లక్షల మందికిపైగా ప్రయాణిస్తున్నారని వెల్లడించారు. హైదరాబాద్‌లోనే సుమారు 8 లక్షల మంది మహిళలు రోజూ సిటీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణిస్తున్నారని మంత్రి పొన్నం తెలిపారు. 

ఉచితం విజయవంతం వేళ సంబురాలు

200 కోట్ల మంది మహిళల ఉచిత ప్రయా ణం పురస్కరించుకొని బుధవారం రాష్ర్టవ్యాప్తంగా 97 ఆర్టీసీ డిపోలు, 341 బస్ స్టేషన్‌ల లో సంబురాలు, ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాలని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదే శిం చారు. మహాలక్ష్మి పథకం విజయవంతం కోసం కృషి చేస్తున్న ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లు, శ్రామిక్‌లు, ఇతర సిబ్బంది అధికారులను మం త్రి అభినందించారు.

ఆర్టీసీ సంస్థ పరిరక్షణ, ప్ర యాణికుల భద్రత, ఉద్యోగుల సంక్షే మం ప్రథమ కర్తవ్యంగా ముందుకు పోతున్నామని మంత్రి పేర్కొన్నారు. ఉచిత ప్రయాణం ద్వారా ద్వారా మహిళా సాధికారత దిశగా అడుగులు పడుతున్నాయని, దూరపు ప్రాంత ప్రజలు కూడా నిత్యం నగరానికి వచ్చి ఉద్యోగాలు చేస్తున్నారని పేర్కొన్నారు. ఉచిత ప్రయాణంతో ఆర్టీ సీ వృద్ధి సాధించడం అభినందనీయమన్నారు.

ప్రతి మహిళ నెలకు రూ.4-5 వేల వరకు ఉచిత ప్రయాణం ద్వారా ఆదా చేసుకుంటున్నారని తెలిపారు. ఈ సంబరాల్లో స్థానిక ఎంపీలు, మం త్రులు, ఎమ్మెల్యేలు ఇత ర ప్రజాప్రతినిధులను ఆహ్వానించాలని ఆదేశించారు. మహిళా ప్రయాణి కుల ప్రసంగా లను ఏర్పాటు చేసి ఉచిత ప్రయాణాల వల్ల వారికి కలిగిన ప్రయోజనాలను, వారి అభిప్రాయాలను తెలుసు కోవాలన్నారు.

మహిళా ప్రయాణికులను శాలు వా, బహుమతితో సత్కరించాలని ఆదేశాలు జారీ చేశారు. ఉచిత ప్రయాణ పథకం, మహిళా సాధికారత మొదలైన అంశాలపై పాఠశాల, కళాశాల విద్యార్థుల కు వ్యా స రచన, రంగోలి, చిత్రలేఖనం నిర్వహించి బహుమతులు అందచేయాలని సూ చించారు. ప్రతి డిపోలోని 5 మంది ఉత్తమ డ్రైవర్లు, 5 మంది ఉత్తమ కండక్టర్లతో పాటు ట్రాఫిక్ గైడ్‌లు, భద్రతా సిబ్బందిని సత్కరించాలని ఆదేశించారు.

జీరో టికెట్స్@200 కోట్లు

పథక విజయంపై సీఎం రేవంత్ రెడ్డి ట్వీట్

ఉచితబస్సు ప్రయాణ పథకం విజయవంతంగా సాగుతోందని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. “18 నెలల ప్రజాపాలనలో 200 కోట్ల జీరో టికెట్ల మైలురాయిని దాటి ఆడబిడ్డల ఉచిత బస్సు ప్రయాణ పథకం విజయవంతంగా కొనసాగుతుండటం ఆనందంగా ఉంది.

ఈ పథకంలో లబ్ధిదారులైన ప్రతి ఆడబిడ్డకు నా అభినందనలు. ఈపథకాన్ని దిగ్విజయంగా అమలు చేయడంలో భాగ స్వాములైన ఆర్టీసీ కార్మికులు, సిబ్బంది, యాజమాన్యానికి ప్రత్యేక అభినందనలు” అని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.