calender_icon.png 1 May, 2025 | 6:43 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పుస్తక పఠనం అలవాటు చేసుకోవాలి

24-04-2025 12:46:21 AM

ఆక్స్ ఫర్డ్ గ్రామర్ స్కూల్ చైర్పర్సన్ మణికొండ ప్రార్థన

ముషీరాబాద్, ఏప్రిల్ 23 (విజయ క్రాంతి) : నేటి డిజిటల్ యుగంలో పుస్తక పఠనాన్ని అలవాటు చేసుకోవాలని ఆక్స్ ఫర్డ్ గ్రామర్ స్కూల్ చైర్పర్సన్ మణికొండ ప్రార్థన అన్నారు. ప్రపంచ పుస్తక దినోత్సవం సందర్భంగా బుధవారం హిమాయత్నగర్లోని ఆక్స్ఫర్డ్ గ్రామర్ స్కూల్ లో ’పుస్తకాల ప్రపంచం’ అనే థీమ్తో ప్రపంచ పుస్తక దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.

స్కూల్ ప్రాంగణంలో పుస్తకాల స్టాల్ ఏర్పాటు చేశారు. పాఠశాలను సజీవ గ్రంథాలయంగా మార్చి విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమం ద్వారా 8వ తరగతి విద్యార్థులకు రాష్ట్రపతి నిలయంలో జరగనున్న ప్రత్యేక ప్రపంచ పుస్తక దినోత్సవ కార్యక్రమానికి హాజరయ్యే అవకాశం లభిం చిందన్నారు.

ఈ సెషన్ లలో పుస్తక పఠనం యొక్క ప్రాముఖ్యత, పుస్తక పఠనం-డిజిటల్ పఠనం’ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కరస్పాండెంట్ కట్టా ప్రభాకర్, డీన్ రామoజుల, ప్రిన్సిపాల్ రేఖా రావు పాల్గొన్నారు.