25-01-2026 12:11:41 AM
డిగ్నిటీ హౌసింగ్ కాలనీస్ ‘టూ బీహెచ్ కే’ జేఏసీ
ముషీరాబాద్, జనవరి 24 (విజయక్రాంతి): జీహెచ్‌ఎంసీలోని డబుల్ బెడ్ రూమ్స్ ఫ్లాట్ ల్లోని సమస్యలను పరిష్కరించాలని డిగ్నిటీ హౌసింగ్ కాలనీస్ ’టూ బీహెచ్ కే’ జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు శైలేష్ సం దీప్ రాజ్ ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు శనివారం బషీర్ బాగ్ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఒక ఏడాది పాటు రాష్ట్ర ప్రభుత్వం ఏఎంసీ సదుపాయం కల్పించాలని కోరారు.
నిర్మాణాలలో పగుళ్ల మర మ్మతులు, మురుగునీటి పారుదల వంటి సమస్యలను జీహెచ్‌ఎంసీ దృష్టికి తీసుకెళ్లిన పరిష్కారం కాలేదన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి మా సమస్యలను పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్ర మంలో ఉపాధ్యక్షుడు విజయ్ బండారి, కార్యదర్శి శివ, జైపాల్, కోశాధికారి శ్రీనివాస్ చారి, సభ్యులు నీలిమ, లక్ష్మీ దేవి, జహంగీర్ పాషా, కుమార్, అనిల్ దుర్గా ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.