calender_icon.png 6 August, 2025 | 5:35 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఘనంగా జయశంకర్ జయంతి

06-08-2025 02:16:39 PM

నివాళులు  అర్పించిన బిఆర్ఎస్ నాయకులు 

నల్లగొండ టౌన్, (విజయక్రాంతి): తెలంగాణ సిద్ధాంతకర్త ఆచార్య జయశంకర్ జయంతి(Jayashankar Jayanti ) సందర్భంగా బుధవారం నల్లగొండలోని ఆయన విగ్రహానికి పలువురు బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు, అభిమానులు పూలమాల సమర్పించి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సిద్ధి కొరకు.. తొలి మలిదశ ఉద్యమాలలో ఉద్యమ స్ఫూర్తిని రగిలించి తెలంగాణ సిద్ధాంతకర్తగా ఉద్యమంలో కేసీఆర్ కు వెన్నుదన్ను గా నిలిచి.. తెలంగాణ రాష్ట్ర సాధన కొరకు విశేష కృషి చేసిన మహనీయుడని అన్నారు.   నేడు మళ్ళీ తెలంగాణ రాష్ట్రం కాంగ్రెస్ పార్టీ కబంధహస్తాల్లో నలిగిపోతున్నదని ఏ ఆశయాలతో తెలంగాణ రాష్ట్రం సాధించామొ ఆ ఆశయాలకు తూట్లు పొడుస్తున్నదన్నారు. 

మహనీయులు రాష్ట్ర సాధన కొరకు తమ ప్రాణాలను ఫణంగా పెట్టి స్వరాష్ట్ర సిద్ది కొరకు పోరాడాలో నేడు మళ్లీ వాటి రక్షణ కొరకు కూడా పోరాడవలసిన పరిస్థితి ఉన్నదని, నేడు..ప్రొఫెసర్ జయశంకర్ గారి ఆశయాలను, ముందుకు తీసుకపోవడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాల్సిన అవసరం ఉన్నదని తెలిపారు. ఈ కార్యక్రమంలో జేఏసీ అధ్యక్షులు జి వెంకటేశ్వర్లు, నల్లగొండ వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ చీర పంకజ్ యాదవ్, నల్గొండ మున్సిపల్ మాజీ ఫ్లోర్ లీడర్ అభిమన్యు శ్రీనివాస్, మాజీ ఎంపీపీ ఎస్ కె కరీం పాషా,మాజీ కౌన్సిలర్లు, మారగోని గణేష్, రావుల శ్రీనివాసరెడ్డి కొండూరి సత్యనారాయణ, సీనియర్ నాయకులు కంచనపల్లి రవీందర్రావు, సింగం రామ్మోహన్ లొడంగి గోవర్ధన్, కనగల్ మండల పార్టీ అధ్యక్షుడు అయితగోని యాదయ్య, కందుల లక్ష్మయ్య,బడుపుల శంకర్ , వనపర్తి నాగేశ్వరరావు, విద్యార్థి నాయకుడు బొమ్మరబోయి నాగార్జున, దండంపల్లి సత్తయ్య, సుంకి రెడ్డి వెంకట్ రెడ్డి,కంకణాల వెంకటరెడ్డి, కోట్ల జయపాల్ రెడ్డి,గణేష్, తదితరులు పాల్గొన్నారు.