23-01-2026 01:14:34 AM
టీఆర్పీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న
ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం సందర్శన
హైదరాబాద్, జనవరి 22 (విజయక్రాంతి): ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయాన్ని ఎమ్మె ల్సీ, తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధినేత తీన్మార్ మల్లన్న గురువారం సందర్శించారు. యూనివర్సిటీ అధికారులు, ప్రొఫెస ర్లు, సిబ్బందితో పాటు విద్యార్థులతో కలిసి తీన్మార్ మల్లన్న ప్రత్యేక సమావేశం నిర్వహించారు. విద్యార్థులు తమ విద్యా సం బంధిత సమస్యలు, మౌలిక వసతులలో పం, హాస్టళ్లలో సదుపాయాల కొరత, ప్రయోగశాలల్లో ఆధునిక పరికరాల లేమి, పరిశోధనలకు తగిన నిధులు అందకపోవడం వంటి అంశాలను ఆయన దృష్టికి తీసుకువచ్చారు. ప్రొఫెసర్లు, అధ్యాపకులు తమ సేవా సమస్యలను మల్లన్నకు వివరించారు.
పదోన్నతులు నిలిచిపోవడం, ఖాళీ పోస్టులు భర్తీ కాకపోవడం, ఒప్పంద పద్ధతిలో పనిచేస్తున్న అధ్యాపకులకు ఉద్యోగ భద్రత లేకపోవడం, పరిశోధనలకు ప్రభుత్వ మద్దతు తగ్గడం, యూనివర్సిటీ అభివృద్ధికి అవసరమైన మౌలిక వసతులు కల్పించకపోవడం వంటి సమస్యలను వారు ప్రస్తావిం చారు. శ్రద్ధగా విన్న తీన్మార్ మల్లన్న.. వ్యవసాయ విద్యా వ్యవస్థ బలోపేతం లేకుండా రైతాంగానికి న్యాయం జరగదని అన్నారు. వ్యవసాయ విశ్వవిద్యాలయాలు రైతుల భవిష్యత్తును తీర్చిదిద్దే కేంద్రాలని పేర్కొన్నారు. సమస్యలను సమగ్రంగా ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం చేసే బాధ్యత తనదేనని భరోసా ఇచ్చారు. విద్య, పరిశోధన, మౌలిక వసతుల అభివృద్ధికి అవసరమైన నిధులు కేటాయించేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువస్తామని స్పష్టం చేశారు.