23-01-2026 01:16:25 AM
హర్షం వ్యక్తంచేసిన ఉపాధ్యాయ సంఘం
హైదరాబాద్, జనవరి 22 (విజయక్రాంతి) : వివిధ ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో పని చేస్తున్న 104 మం దికి పైగా అధ్యాపకులకు అసోసియేట్ ప్రొఫెసర్‌గా పదోన్నతి లభిం చింది. 14 ఏళ్ల బోధన సేవలు, పరిశోధనా అనుభావాన్ని గుర్తించిన ప్ర భుత్వం అన్ని సబ్జెక్టులతో కలిపి మల్టీజోన్ 1 నుంచి 50 మంది, మల్టీజోన్ 2 నుంచి 54 మంది అధ్యాపకులు పదోన్నతికి అర్హత సాధించారు.
డిగ్రీ కళాశాలలకు చెందిన ఉపాధ్యాయులకు అసోసియెట్ ప్రొఫెసర్‌గా పదో న్నతి కల్పించడంపై అద్యాపకుల సం ఘంరాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఎరుగు బ్రిజేష్ , సౌందర్య జోసెఫ్, శ్రీనివాస్‌గౌడ్, అమరందర్‌రెడ్డి తదితరులు హర్షం వ్యక్తం చేశారు. సీఎం రేవంత్‌రెడ్డి, విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ యోగితారాణా, కమిషనర్ శ్రీదేవసేన ఇతర అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు.