17-12-2025 12:00:00 AM
శమవ్యాయామౌ యోగక్షేమయోర్యోనిః
(కౌటిలీయం - 6-2)
శమము, వ్యాయామములు యోగక్షేమాలకు కారణాలు అంటారు, ఆచార్య చాణక్య. సంకల్పించిన కార్యాన్ని పరిసమాప్తి చేసేంత వరకు నడిపించేది ‘వ్యాయామం‘ కాగా.. పూర్తి చేసిన పనుల వల్ల కలిగే ఫలితాన్ని ఏ బాధలు లేకుండా అనుభవింప చేసేది ‘శమము‘.‘యోగము’ మన కు లేనిదానిని పొందడం.. ‘క్షేమం’ పొంది న దాని ని కాపాడుకోవడం. ఈ రెండింటికీ కారణమయ్యేది షాడ్గుణ్యం. సంధి (శాంతి), విగ్రహం (యుద్ధం), ఆసనం (తటస్థత), యానం (సిద్ధపడడం), సంశ్రయం (ఆశ్రయాన్ని కోరడం), ద్వైదీభావం (ద్వంద్వవిధానం) ఈ ఆరింటిని షాడ్గుణ్యం అంటారు.
క్షయం, స్థానం (ఉన్నది ఉన్నట్లు ఉండడం) అభివృద్ధి ఈ మూడూ షాడ్గు ణ్యం యొక్క ఫలాలు అంటారాయన. ‘దైవమానుషం హి కర్మలోకం యాపయతి‘.. దైవం వల్ల జరిగే పని.. మనుష్య ప్రయ త్నం వల్ల జరిగే పని.. ఈ రెండే లోకాన్ని నడిపిస్తా యి, అంటారాయన. ప్రత్యక్షంగా కనిపించే మనుషుల ప్రయత్నం రెండు వి ధాలు. మొదటిది నయం (నీతియుక్తం).. రెండోది అపనయం (నీతి విరుద్ధం).
మా నవ ప్రయత్నం ద్వారా యోగక్షేమాలు లభిస్తే అది ‘నయ‘మని, ఆపదలు సంభవిస్తే ‘అపనయ‘మని అన్నారు. సుస్థిరమైన అభ్యుదయాన్ని కోరేవారు ఆత్మవిశ్వాసంతో, నీతియుక్తంగా ప్రవర్తించాలి. ఒక దగ్గర ఆగిపోయేది అభ్యుదయం కాదు.. పద్ధతి ప్రకారం, నిలకడగా సాగిపోయేదే అ భ్యుదయం. ఒక్క చక్రం ఉన్న బండి సరిగా నడవదు.. నూతనత్వం, రక్షణ, భద్రత కలిగిన వ్యవస్థయే అభ్యుదయం వైపు నడిపి స్తుంది. వేగంగా పరుగెత్తగలిగిన కుందేలును, నెమ్మదిగానైనా నిలకడగా పరుగెత్తి ఓడించిన తాబేలు కథను చదివాము కదా.
నిర్వహణ బాధ్యతలు..
స్వయం సమృద్ధిని సాధించిన ఆర్థికవ్యవస్థ కలిగిన రాజ్యమే ప్రపంచానికి ఆధిప త్యం వహించగలుగుతుంది. ప్రజల విద్య, ఆరోగ్యాలే దేశాభ్యుదయానికి సోపానాలు. ఆర్థిక స్వావలంబనకు రాజు తన రాజ్యంలోని ప్రజలందరికీ సమాన అవకాశాలను ఇవ్వడం, భూమిని వ్యవసాయ యోగ్యం గా తీర్చిదిద్దడం, వ్యాపార రంగానికి అనువుగా మౌలిక వసతులను కల్పిస్తూ.. ఉత్ప త్తి సేవల విలువలను పెంచడం, శాంతిభద్రతలను కాపాడడం, పటిష్టమైన చట్టాల ను నిబద్ధతతో, సమర్ధవంతంగా అమలుచేయడం అవసరం.
మౌలిక వసతుల కల్ప న.. రోడ్లు, భవనాలు, విద్యుత్తులాంటివి కల్పించడం, సమాచార, నెట్ వర్కింగ్ వ్య వస్థలను అందుబాటులోకి తేవడం, సా మాజిక సంక్షేమాలను అర్హత ప్రాతిపదికగా అమలుపరచడం.. ఈ మూడింటినీ బాధ్యతాయుతంగా నిర్వహించడం వల్ల ప్రజలు స్వయం సమృద్ధిని సాధించేందుకు మా ర్గం సుగమమౌతుంది. ప్రతిభ, సమర్ధత, గెలవాలనే కసి కలిగిన వారు సాధిస్తున్న అభ్యుదయంతో తృప్తి చెందరు.
తమ విజ యం చెప్పుకోదగినదే అయి నా అది చాలదనే భావన నిలిచినప్పుడే.. వ్యక్తులు తమ శక్తియుక్తులను పూర్తిగా వె చ్చించి, ఉన్నత ప్రమాణాలతో కూడిన ఉత్పత్తులను, సేవలను అందించగలుగుతారు. తెలంగాణ 2034, 2047లకు నిర్దే శించుకున్న ఆర్థిక ప్రగతికి సంబంధించిన లక్ష్యం దానికి ఉదాహరణగా చెప్పుకోవ చ్చు.
సాధించిన ప్రగతి, అభ్యుదయం ప్రజలందరికీ అందినప్పుడే అది సమగ్రతను సాధించినట్లుగా.. నిలకడ కలిగిన అభ్యుదయంగా చెప్పుకుంటాము. ధరల పెరుగుద ల వల్ల పేదలు కష్టాలపాలవుతారు. ప్రభుత్వాలు ధరల పెరుగుదలను నియంత్రించ గలిగిన అధికారిక వ్యవస్థను ఏర్పరచి సమర్ధులైన అధికారులకు దాని నిర్వహణ బాధ్యతలను అప్పగించాలి.
ఆర్థిక ప్రగతి..
ఉత్పత్తి, ఉత్పాదకతలను పెంచే ఆర్థిక కార్యక్రమాలు ఎక్కువగా పల్లెల్లో జరగాలని భావించాడు, చాణక్య. ఆదర్శవంత మైన పల్లెలను అభివృద్ధికి ప్రతీకలుగా తీర్చిదిద్దాల్సిన అవసరాన్ని గుర్తించాడు. చైనా ఒకప్పుడు పల్లె ప్రజలకు నిలకడైన ఆ ర్థిక ప్రగతిని కల్పించేందుకు ‘గ్యాంగ్ డాం గ్‘ (Guangdong) పద్ధతిని అనుసరించి ఉత్తమ ఫలితాలను సాధించింది. నిజానికది సరైనది అనలేము కాని ఉత్తమమైనది అనవచ్చు.
ఏ రాజ్యమైనా మూలశక్తిని లే దా సమర్ధతను గుర్తించి తదనుగుణమైన వ్యవస్థను నిర్మించుకోవాలి. చట్టబద్ధమైన వ్యాపారాలు, వాణిజ్యాలు, పరిశ్రమల స్థా పనలు జరిగేందుకు అవసరమైన విధాన నిర్ణయాలను పాలకులు సులభతరం చే యాలి. అధికారులు లేదా నాయకుల అవినీతికి అడ్డుకట్టవేయాలి. రాజకీయ నాయ కుల ఆలోచనల్లో స్వల్పకాలిక ప్రయోజనా లు ప్రముఖ పాత్రను పోషిస్తాయి. వారి దృష్టి వచ్చే ఎన్నికలపై నిలుస్తుందే కాని దీర్ఘకాలిక ఆర్థిక ప్రగతిని గూర్చిన ఆలోచనలకు వారు ప్రాధాన్యతనీయరు.
విజ్ఞానం నైపుణ్యం కలిస్తేనే ప్రగతి. యువత వైవిధ్యభరితమైన నైపుణ్యాలు సంతరించుకోవ డం దేశాభ్యుదయంలో ప్రముఖ పాత్రను పోషిస్తుంది. నైపుణ్యాలు సంతరించుకోవడానికి ప్రభుత్వాలు, ప్రైవేటు సంస్థలు పూ ర్తిబాధ్యతను తీసుకోవడం సాధ్యపడదు. ప్రభుత్వ ప్రైవేటు సంస్థల భాగస్వామ్య, సహకారాల వల్లనే ఉత్తమ ఫలితాలు ఆవిష్కృతమౌతాయి. సంకల్పం బలీయమైన దైతే.. తదనుగుణమైన ఫలితాలు ఆవిష్కృతమౌతాయి. మిశ్రమ ఆర్థిక వ్యవస్థయే ఉన్నత ఫలితాలను ఇస్తుందని ప్రతిపాదించాడు, ఆచార్య చాణక్య.
నిరోధించే భూతం..
ప్రభుత్వం విభిన్న ఆర్థిక లావాదేవీలను చురుకుగా, సమర్ధవంతంగా, తెలివిగా, లా భదాయకంగా నడపాలి, అంటారాయన. ప్రభుత్వ ప్రైవేటు రంగాల్లో ఎవరి బాధ్యతలేమిటో తెలిసి కలసికట్టుగా నడిస్తే యోగ ము, క్షేమమూ, అభ్యుదయం. ఒక రాజ్యం లో ప్రజలు పేదరికంలో మగ్గుతూ తమ పేదరికానికి దైవాన్ని, అదృష్టాన్ని కారణాలుగా భావిస్తున్నారు. దానిని గమనించిన రాజుగారు ఒకనాడు ‘మీ అభివృద్ధిని నిరోధిస్తున్న భూతాన్ని నేను బంధించి ఒక పే టికలో భద్రపరిచాను.
ఆసక్తి కలిగిన వారు చూడవచ్చు’ అని చాటించాడు. తెల్లవారి మైదానంలో ఆ పేటికను పెడితే ప్రజలం తా తమ అభివృద్ధిని నిరోధించే భూ తా న్ని చూడాలనే కోరికతో అక్కడికి చేరుకున్నారు. ఒక్కొక్కరుగా పేటిక మూతను తీసి చూచి ఆశ్చర్యపోయారట. నిజానికి అందు లో ఒక పెద్ద అద్దాన్ని పెట్టించాడు, రాజుగారు. ఆ అద్ధంలో అందరూ తమ ప్రతి బింబాన్నే చూసుకున్నారు. ఒకరికి ఒక రం గుపై అత్యంతమైన ఇష్టం ఉన్నది.
ఒకనా డు తన మిత్రులను విందుకు పిలిచాడ ట. అందరూ బహుమతులను తెచ్చారు.. అ యితే ఆశ్చర్యంగా అందరి వస్తువులరం గూ మిత్రుడు కోరుకునేదే. మనం బాధల ను కోరుకుంటే, అసమర్ధతను కోరుకుంటే, అపజయాన్ని కోరుకుంటే అదే ప్రతిబింబిస్తుంది.. మనల్ని అదే పలకరిస్తుంది. విజ యాన్ని కోరుకుంటే.. విజయమే దక్కుతుం ది. అదృష్టాన్ని నమ్ముకొని ప్రయత్నా న్ని అనాదరిస్తే.. అపజయమే పలకరిస్తుంది.
వ్యాసకర్త: పాలకుర్తి రామమూర్తి,
సెల్: 9441666843