05-09-2025 07:18:34 PM
రాజన్న సిరిసిల్ల,(విజయక్రాంతి): ముస్లింల ఆరాధ్య దైవం మహమ్మద్ ప్రవక్త జన్మదిన పురస్కరించుకొని సిరిసిల్ల మజీద్ కమిటీ ఆధ్వర్యంలో రోగులకు పండ్లు బ్రెడ్ పంపిణీ చేశారు. ముస్లింలు అత్యంత భక్తిశ్రద్ధలతో కొలిచే మహమ్మద్ ప్రవక్త పుట్టినరోజును పురస్కరించుకొని సిరిసిల్ల మజీద్ కమిటీ ఆధ్వర్యంలో ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి రోగులకు పండ్లు బ్రెడ్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మజీద్ కమిటీ అధ్యక్షుడు సమీ మాట్లాడుతూ... సమస్త మానవాళి శాంతి కోసం మహమ్మద్ ప్రవక్త తన ప్రవచనాలని బోధించాలని అన్నారు. కులమత బేధాలు లేకుండా అందరితో ప్రేమతో ఉండాలని తోచిన సహాయాన్ని తోటి వారికి అందించాలని మహమ్మద్ ప్రవక్త సూచించినట్లు తెలిపారు. అలాగే సిరిసిల్ల పట్టణంలోని ఇస్లాంపూర్ యూత్ ఆధ్వర్యంలో ఖీర్ ఫాతిహా చేసి పంపిణీ చేశారు.