17-12-2025 12:49:24 AM
సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాకథాన్
హైదరాబాద్, డిసెంబర్ 16 (విజయక్రాంతి): సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 115వ వ్యవస్థాపక దినోత్సవాన్ని డిసెంబర్ 21న జరుపుకుంటోంది. ఈ సందర్భంగా మంగళవారం ‘భూమిని రక్షించండి, ఆరోగ్యంగా ఉండండి’ అనే వాకథాన్ నిర్వహిం చారు. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 115 వ వ్యవస్థాపక దినోత్సవానికి దారితీసే కార్యకలాపాలలో భాగంగా, కడప ప్రాంతీయ కార్యాలయం, ‘ఆరోగ్యంగా ఉండండి,
ఫిట్ గా ఉండండి‘ అనే థీమ్‌తో ఫిట్నెస్ అవగాహన వాకథాన్‌ను విజయవంతంగా నిర్వ హించింది. కడప ప్రాంతీయ కార్యాలయం, నగరపాలెం ప్రాంతంలో వాకథాన్ నిర్వహించింది. ప్రాంతీయ అధిపతి ఇ.వెంకటేశ్వ రరావు సమక్షంలో ఈ కార్యక్రమం జరిగింది. రాకేష్ రంజన్, చీఫ్ మేనేజర్, ఉద్యోగులు పాల్గొన్నారు.