17-12-2025 12:50:40 AM
గోవా గవర్నర్‌ను ఆహ్వానించిన గజల్ శ్రీనివాస్
హైదరాబాద్, డిసెంబర్ 16 (విజయక్రాంతి): ఏపీ ఆంధ్ర సారస్వత పరిషత్ ఆధ్వ ర్యంలో 2026 జనవరి 3 నుంచి 5వ తేదీ వరకు గుంటూరులోని అమరావతి శ్రీ సత్య సాయి స్పిరచువల్ సిటీ ప్రాంగణం, ఏటుకూరు (హైవే)లో నందమూరి తారకరామా రావు వేదికపై 3వ ప్రపంచ తెలుగు మహాసభలు నిర్వహించనున్నట్టు డా. గజల్ శ్రీనివా స్, అధ్యక్షుడు, ఆంధ్ర సారస్వత పరిషత్తు తెలిపారు.
5 జనవరి 2026 ఉదయం 10 గంట లకు జరిగే ‘ఆంధ్ర వైభవం’ కార్యక్రమానికి గోవా గవర్నర్ పూసపాటి అశోక్ గజపతి రాజు హాజరవుతారని చెప్పారు. ఈ సందర్భంగా ఆయనను విజయనగరం స్వగృహం లో కలసి ధన్యవాదాలు తెలియజేసినట్లు డా గజల్ శ్రీనివాస్ తెలిపారు.