17-12-2025 12:47:30 AM
హైదరాబాద్, డిసెంబర్ 16 (విజయక్రాంతి) : తెలంగాణ విద్యాభివృద్ధికి సహక రించాలని కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్, ధర్మేంద్ర ప్రధాన్‌కు సీఎం రేవం త్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. బలహీన వర్గాల పిల్లలకు నాణ్యమైన విద్యను అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను వారికి వివరించారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మంగళవారం కేంద్ర మంత్రులను పార్లమెంట్‌లోని వారి చాంబర్లలో వేర్వేరుగా కలిసి పలు విజ్ఞప్తులు చేశారు.
రాష్ట్రంలోని 104 అసెంబ్లీ నియోజక వర్గా ల్లో నిర్మిస్తున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ ( వైఐఐఆర్‌ఎస్) స్కూళ ప్రాధాన్యతను కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్‌కు తెలియజేశారు. 5 నుంచి 12 తరగతుల వరకు ఒక్కో స్కూల్‌లో 2,600 మంది విద్యార్థులు ఉం టారని, మొత్తంగా 105 పాఠశాలల్లో 2.70 లక్షల మంది విద్యార్థులకు నా ణ్యమైన విద్యాబోధన లభిస్తుందని వివరించారు..
విద్యాభివృద్ధికి రూ.30 వేల కోట్లు..
అత్యాధునిక వసతులు, లేబోరేటరీలు, స్టేడియాలతో నిర్మించే 105 యంగ్ ఇండి యా ఇంటిగ్రెటేడ్ రెసిడెన్సియల్ స్కూళ్ల నిర్మాణానికి రూ.21 వేల కోట్ల వ్యయం అవుతుందని తెలిపారు. అలాగే రాష్ట్రంలోని జూనియర్, డిగ్రీ, సాంకేతిక కళాశాలు, ఇతర ఉన్న విద్యా సంస్థల్లో అధునిక ల్యాబ్‌లు, ఇతర మౌలిక వసతుల కల్పనకు మరో రూ.9 వేల కోట్లు వెచ్చించనున్నట్లు కేంద్ర మంత్రికి సీతారామన్‌కు వివరించారు. మొ త్తంగా రాష్ట్రంలో రూ.30 వేల కోట్లు వెచ్చిస్తున్నట్లు సీఎం తెలిపారు.
వీటికి నిధుల సమీకరణకు తాము ప్రత్యేక ప్రయోజన సంస్థ (ఎస్‌పీసీ) ఏర్పాటు చేయదల్చామని, దాని ద్వారా సేకరించే రుణాలకు ఎఫ్‌ఆర్‌బీఎం(ఆర్థిక బాధ్యత, బడ్జెట్ నిర్వహణ) పరిమి తి నుంచి మినహాయించాలని విజ్ఞప్తి చేశారు. విద్యా రంగంపై తమ ప్రభుత్వం చేస్తున్న వ్య యాన్ని మానవ వనరుల అభివృద్ధికి చేస్తున్న పెట్టుబడిగా భావించాలని కోరారు. తెలంగాణలో యంగ్ ఇండియా రెసిడెన్సియల్ స్కూళ్ల ఏర్పాటు, విద్యారంగం అభివృద్ధిపై సీ ఎం రేవంత్‌రెడ్డి చూపుతున్న చొరవను కేం ద్ర మంత్రి నిర్మలాసీతారామన్ ప్రశంసించా రు. వైఐఐఆర్ మోడల్ బాగుందని, ఎస్‌పీసీకి సంబంధించిన వివరాలను అందజే యాలని సూచించారు.
జిల్లాల సంఖ్యకు అనుగుణంగా..
తెలంగాణలో పెరిగిన జిల్లాల సంఖ్యకు అనుగుణంగా నూతనంగా 9 కేంద్రీయ, 16 జవహర్ నవోదయ విద్యాలయాలను మం జూరు చేయాలని కేంద్ర మంత్రికి సీఎం విజ్ఞప్తి చేశారు. పెరుగుతున్న పట్టణీకరణ, గ్రామీణ ప్రాంత విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేందుకు కేంద్రీయ విద్యాలయాలు, జవహర్ నవోదయ విద్యాలయాల ఏర్పాటు అవసరం ఉందన్నారు. పలు జిల్లాల్లో వెంటనే ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఆ విద్యాలయాల ఏర్పాటుకు అవసరమైన స్థలం, వసతులు కల్పిస్తామన్నారు. ఆయా కేంద్రమంత్రుల భేటీలో సీఎం వెంట ఎంపీలు మల్లు రవి, సురేష్ షెట్కార్, చామల కిరణ్‌కుమార్‌రెడ్డి , అనిల్‌కుమార్, ఏపీ జితేందర్ రెడ్డి ఉన్నారు.
ఐఐఎం ఏర్పాటుకు వసతులు కల్పిస్తాం
హైదరాబాద్‌లో ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ (ఐఐఎం) మంజూ రు చేయాలని కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌కు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. టెక్నాలజీ, లైఫ్ సెన్సైస్, ఏరో స్పేస్, డిఫెన్స్, లాజిస్టిక్స్, అడ్వాన్డ్స్ మాన్యుఫ్యాక్చరింగ్ రంగాల్లో ముందున్న హైదరాబాద్‌లో ఐఐఎం ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని సీఎం తెలిపారు. దేశంలో 19 రాష్ట్రాల్లో, కేంద్ర పాలిత ప్రాం తంలో కలిపి 21 ఐఐఎంలు ఉన్నాయని, తెలంగాణ రాష్ర్టంలోనూ ఐఐఎం ఏర్పాటు చేయాలని కేంద్ర మంత్రిని సీఎం కోరారు.
ఐఐఎం ఏర్పాటుకు అవసరమైన 200 ఎకరాల భూమిని యూనివర్సిటీ ఆఫ్ హైదరా బాద్ ప్రాంగణంలో గుర్తించామని తెలిపారు. ఐఐఎం తరగతులు వెంటనే ప్రారంభించేందుకు ట్రాన్సిట్ క్యాంపస్ సిద్ధంగా ఉందని వెల్లడించారు. ఐఐఎం ఏర్పాటుకు అవసరమైన అనుమతులు వెంటనే మంజూ రు చేయడంతో పాటు అవసరమైన వసతులు కల్పనకు తాము సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. దేశంలోని అన్ని ప్రాంతాలకు రాకపోకలు సాగించేందుకు వీలుగా హైదరా బాద్‌కు ఎయిర్, రైల్, రోడ్డు తదితర రవాణా సౌకర్యం ఉందన్నారు. అనుకూల వాతావరణం, భిన్న రంగాల ప్రముఖులను అందజే సిన చరిత్ర హైదరాబాద్‌కు ఉందని సీఎం తెలిపారు.