05-07-2025 03:44:17 PM
దేశవ్యాప్త సమ్మెను విజయవంతం చేయాలి
మందమర్రి,(విజయక్రాంతి): కేంద్రంలోని మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను కార్మిక వర్గం ఐక్యంగా సమ్మెతో తిప్పి కొట్టా లని, దేశ వ్యాప్త సమ్మెతోనే కార్మికుల పరిరక్షణ సాధ్యమ వుతుందని కార్మిక సంఘాల జేఏసీ నాయకులు అన్నారు. ఏరియాలోని కెకె 5 గనిపై నిర్వహించిన గేట్ మీటింగ్లో కార్మికులను ఉద్దేశించి మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం అనుస రిస్తున్న కార్మిక వ్యతిరేక విధా నాలకు నిరసనగా ఈనెల 9న జేఏసీ ఆధ్వర్యంలో జరుప తలపెట్టిన సమ్మెలో సింగరేణి కార్మికులు స్వచ్ఛందంగా పాల్గొ ని విజయవంతం చేయాలని కోరారు. కేంద్ర ప్రభుత్వం వెంట నే నాలుగు లేబర్ కోడ్ ల విధానాన్ని రద్దు చేసి, 44 కార్మి క చట్టాలను యదాతదంగా అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు.
కేంద్ర బిజెపి ప్రభుత్వం 44 చట్టాలను రద్దు చేసి 4 కోడులుగా విభజించి కార్మిక చట్టాలు, కార్మిక సంఘాలు, వేతన కమిటీలు లేకుండా కార్మికులను కార్మిక సంఘాలను నిర్వీర్యం చేసి కార్మిక వర్గాన్ని కట్టు బానిస లుగా మార్చే ప్రమాదం ఉందని వారు ఆందోళన వ్యక్తంచేశారు. దేశవ్యాప్తంగా అన్ని కార్మిక సంఘాలు బ్రిటిష్ కాలం నాటి చట్టాలను అనేక పోరాటాల ద్వారా రద్దు చేసుకొని, 44 కార్మిక చట్టాలను సాధించు కోవడం జరిగిందని, 44 కార్మిక చట్టాల పరిరక్షణకు ఈనెల 9 న జరుగు దేశ వ్యాప్త సమ్మెలో సింగరేణిలో ఉన్న సంఘటిత, అసంఘటిత, అన్ని విభాగాల సింగరేణి కార్మికులు పాల్గొని జయప్రదం చేయాలని వారు కోరారు.