05-07-2025 09:11:41 PM
కార్పొరేషన్ కమిషనర్ త్రిలేశ్వర్ మరియు హెచ్ఎండిఏ అధికారుల సహకారం తో రోడ్డు పనులు ప్రారంభం
హెచ్ఎండిఏ, మున్సిపల్ అధికారులకు తుంగతుర్తి రవి కృతజ్ఞతలు
మేడిపల్లి: పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని మేడిపల్లి నుండి పర్వతాపూర్ చెరువు నుండి అరోరా కాలేజ్ వరకు బీటీ రోడ్ అభివృద్ధి పనులకు అనుమతి లభించింది.ఈ రోడ్డు పరిస్థితిని, ప్రజల అవసరాలను పరిగణనలోకి తీసుకొని,కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తుంగతుర్తి రవి గారు పలు సందర్భాలలో పీర్జాదిగూడ కమిషనర్, హెచ్ఎండిఏ కమిషనర్ లను కలిసి పరిస్థితిని విన్నవించడంతో హెచ్ఎండిఏ అధికారుల సమన్వయంతో రోడ్డు పనులకు అనుమతి లభించింది.
వెంటనే సంబంధిత కాంట్రాక్టర్,మెజర్మెంట్ పనులు చేపట్టడం ద్వారా రోడ్డు అభివృద్ధికి తొలి అడుగు పడింది. ఈ సందర్భంగా తుంగతుర్తి రవి మాట్లాడుతూ రోడ్డు పనులు రాబోయే బోనాల పండుగ లోపు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని సదరు కాంట్రాక్టర్ కు ఆదేశించారు. ఈ రోడ్డు అభివృద్ధికి సహకరించిన మున్సిపల్ కమిషనర్ త్రిలేశ్వర్ గారికి, హెచ్ఎండిఏ కమిషనర్ గారికి,అధికారులు, సిబ్బందికి,కాంట్రాక్టర్ తదితరులకు తుంగతుర్తి రవి కృతజ్ఞతలు తెలియజేశారు.