calender_icon.png 5 July, 2025 | 8:21 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దేవాలయాలకు 1.50 కోట్ల చెక్కులు పంపిణీ చేసిన డా.కోట నీలిమ

05-07-2025 03:39:36 PM

సనత్ నగర్,(విజయక్రాంతి): సికింద్రాబాద్ లోని ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాలను ఘనంగా నిర్వహించాలని పీసీసీ ఉపాధ్యక్షురాలు, సనత్ నగర్ నియోజకవర్గ ఇంచార్జి డాక్టర్ కోట్ నీలిమ అధికారులను కోరారు. శనివారం మహంకాళి ఆలయం వద్ద సనత్ నగర్ నియోజకవర్గ పరిధిలోని 263 దేవాలయ కమిటీల సభ్యులకు రూ 1.49 కోట్ల విలువైన ఆర్ధిక సహాయం చెక్కులను స్థానిక ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్, డిప్యూటీ మేయర్ మోతె శ్రీలతా రెడ్డిలతో కలిసి పంపిణీ చేశారు.

అనంతరం ఆమె మాట్లాడారు. ఈ నెల 13న జరిగే సికింద్రాబాద్ బోనాల ఉత్సవాల నిర్వహణ ఏర్పాట్లపై జీహెచ్‌ఎంసీ, దేవాదాయ, వాటర్ వర్క్స్, ఎలెక్ట్రికల్, హెల్త్, పోలీస్, ట్రాఫిక్ పోలీస్, అగ్నిమాపకం తదితర శాఖలకు చెందిన అధికారులతో కలిసి సమీక్ష నిర్వహించనున్నట్లు వెల్లడించారు.బోనాల ఉత్సవాల సందర్భంగా అమ్మవారి దర్శనానికి ప్రతి ఏటా వివిధ ప్రాంతాల నుంచి లక్షలాదిమంది భక్తులు వస్తుంటారని వివరించారు. అందుకు తగ్గట్టుగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోందన్నారు. 

సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాలను గతేడాది కన్నా ఈ సంవత్సరం ఇంకా ఘనంగా నిర్వహిస్తున్నట్టు తెలిపారు. కులమతాలకు, రాజకీయాలకు తావు లేకుండా ఈ బోనాల జాతరను విజయవంతం చేయాలని అన్ని పార్టీల నాయకులను కోరారు. బోనాల విజయవంతానికి సహకరించాలని స్థానిక షాపు యజమానులకు, ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు టి.మహేశ్వరి, దీపిక, దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ సంధ్యారాణి, కాంగ్రెస్ పార్టీ స్థానిక నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.