9 July, 2026 | 1:47 AM

గాంధీభవన్ వద్ద నిరసన

09-07-2026 12:40 AM

సూర్యాపేట(విజయక్రాంతి): అర్వపల్లిలో ఉద్రిక్తతల అనంతరం కాంగ్రెస్ సీనియర్ నాయకులు దరూరి యోగానందచార్యులు ఆధ్వర్యంలో గాంధీభవన్‌కు చేరుకుని, నిరసన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే మందుల సామేలు కబంద హస్తాల నుంచి కాంగ్రెస్ పార్టీని కాపాడాలంటూ సేవ్ కాంగ్రెస్ అనే నినాదాలతో ధర్నా నిర్వహించారు.

దీంతో గాంధీభవన్ వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. అధిష్ఠానం జోక్యం చేసుకొని నియోజకవర్గంలో ఇటీవల ప్రకటించిన మండల కమిటీలను రద్దుచేసి, మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కోసం అహర్నిశలు పనిచేసిన వ్యక్తులను ఎంపిక చేయాలని డిమాండ్ చేశారు.