calender_icon.png 18 May, 2025 | 6:05 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బిచ్కుంద మండల కేంద్రంలో ఎస్జీటీయు యూనియన్ ఆధ్వర్యంలో నిరసన

04-04-2025 11:52:26 PM

బిచ్కుంద,(విజయక్రాంతి): నిజామాబాద్ లో జరగబోయే ఎస్ఎస్సీ స్పాట్ వాల్యూయేషన్ కోసం స్పెషల్ అసిస్టెంట్లుగా ఎస్జిటియు ఉపాధ్యాయులను కేటాయించినందున  ఎస్జిటియు ఉపాధ్యాయ సంఘం కామారెడ్డి జిల్లా బిచ్కుంద శాఖ ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్బంగా ఎస్జిటి సంఘం బిచ్కుంద అధ్యక్షులు షేఖ్ ఖయ్యూమ్ మాట్లాడుతూ... ఎస్ఎస్సి స్పాట్ వాల్యుయేషన్ స్పెషల్ అసిస్టెంట్లుగా ఎస్జిటి యు ఉపాధ్యాయులకు విద్యాశాఖ అధికారికి  అనుమతి లేకుండా జిల్లా విద్యాశాఖ అధికారులు విధులు ఉపాధ్యాయులకు విధులు కేటాయించడం జరిగింది.  గత కొన్ని రోజుల కిందట ఎస్ఎస్సి  వార్షిక పరీక్షల ఇన్విజిలేషన్ విధులు నిర్వహించడం జరిగింది. అనంతరం వెంటనే ఎస్ఎస్సి స్పాట్ వాల్యూయేషన్ విధులకు ఎస్జిటి యు ఉపాధ్యాయులను కేటాయించడం వల్ల ప్రాథమిక పాఠశాలలో బోధన కుంటుపడుతుంది.

అదేవిధంగా ఈనెల 09 నుంచి జరిగబోయే సమ్మేటివ్ వార్షిక పరీక్షలకు మరింత అంతరాయం కలుగుతుంది.అయితే ఒక పాఠశాలలో ఇద్దరు ఉపాధ్యాయులు ఉంటే ఇద్దరికీ కూడా డ్యూటీ అలౌట్  కావడం కొసమెరుపు. ఎస్ జి టి  యు ఉపాధ్యాయుల అనుమతి లేకుండానే విధులు కేటాయించడం వల్ల ఉపాధ్యాయులు ఆందోళనలో ఉన్నారు. కావున ఎస్జీటీ యు ఉపాధ్యాయులకు టెన్త్ స్పాట్ వాల్యూషన్ విధుల నుండి మినహాయింపు ఇవ్వాలని కోరారు.ఇప్పుడైనా జిల్లా అధికారులు స్పందించి ఎస్జిటి యు ఉపాధ్యాయులకు ఎస్ఎస్సి  స్పాట్ వాల్యుయేషన్ స్పెషల్ అసిస్టెంట్లుగా కేటాయించిన  ఎస్జిటి యు ఉపాధ్యాయులకు విధుల నుండి మినహాయింపు ఇవ్వాలని అన్నారు.ఈ కార్యక్రమం లో ఎస్ జి టి యు రాష్ట్ర కార్యదర్శి విజయ్ పటేల్, బిచ్కుంద మండల ఉపాధ్యక్షురాలు వినిత గౌడ్, ప్రధాన కార్యదర్శి టీ మారుతి, ఉపాధ్యక్షులు చాంద్ పాషా,ప్రత్యేక సలహాదారు ఆన్సర్ ఘోరి,కార్యవర్గ సభ్యులు టీ సంగమేశ్వర్, నాయిని గంగారాం తదితరులు పాల్గొన్నారు.