calender_icon.png 18 May, 2025 | 12:21 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆన్ లైన్ బెట్టింగ్, సైబర్ క్రైమ్ పై ప్రజలకు అవగాహన కల్పించాలి

04-04-2025 11:48:47 PM

మిస్సింగ్ కేసుల ఛేదనకు ప్రత్యేక దృష్టి సారించాలి

బిడిఎల్ భానూర్ పోలీసు స్టేషన్ ను ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ  పరితోష్ పంకజ్ 

సంగారెడ్డి,(విజయక్రాంతి): ఆన్ లైన్ బెట్టింగ్, సైబర్ క్రైమ్ పై ప్రజలకు అవగాహన కల్పించేందుకు పోలీసులు కృషి చేస్తున్నారని సంగారెడ్డి ఎస్పి పరితోష్ పంకజ్ తెలిపారు. శుక్రవారం బిడిఎల్ పోలీస్ స్టేషన్ ను తనిఖీ చేసి పలు సూచనలు చేశారు. పోలీసు స్టేషన్ పరిసరాల పరిశుభ్రతను పరిశీలించారు. పోలీస్ స్టేషన్ రికార్డ్ లను తనిఖీ చేసి అండర్ ఇన్వెస్టిగేషన్ లో ఉన్న కేసుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ముఖ్యంగా మిస్సింగ్ కేసుల ఛేదనకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి, మిస్సింగ్ పర్సన్స్ ను ట్రేస్ చేయాలని తెలిపారు. ప్రతి వర్టికల్ కు ఒక అధికారిని నియమించి, రికార్డ్స్ ఎలాంటి పెండింగ్ లేకుండా చూడాలని యస్.హెచ్.ఓ కు సూచనలు చేశారు. సిబ్బంది అధికారులు స్టేషన్ కు వచ్చిన వారితో మర్యాదగా మాట్లాడాలని, సివిల్ తగాదాలలో తలదూర్చకూడదు అన్నారు. సిబ్బంది అధికారులు 24*7 అందుబాటులో ఉంటూ శాంతి భద్రతల పరిరక్షణలో కృషి చేయాలని అన్నారు.

హిస్టరీ షీటర్స్, సస్పెక్ట్స్  పాత నేరస్తులపై నిఘా ఉంచాలని అన్నారు. నైట్ బీట్, పెట్రోల్లింగ్ అధికారులు వీధి నిర్వాహణలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మన చుట్టూ జరుగుతున్న ఆన్ లైన్ మోసాలు, బెట్టింగ్స్, బెట్టింగ్ యాప్ గురించి, రోడ్డు ప్రమాదాల గురించి జిల్లా ప్రజలలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని, రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రధాన కూడళ్లలో ఫ్రీ లెఫ్ట్ ఏర్పాటు చేయడం, బోలార్డ్స్, రాంబుల్ స్ట్రిప్స్ వేయించడం , తరుచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్న ప్రాంతాలను బ్లాక్ స్పార్ట్ లు గుర్తించి, సూచిక బోర్డు లను ఏర్పాటు చేయాలని అన్నారు. విజిబుల్ పోలిసింగ్ లో భాగంగా డ్రంక్ అండ్ డ్రైవ్, ఈ-పెట్టి కేసులు నమోదు చేయాలని యస్.హెచ్.ఒ కు పలు సూచనలు చేశారు.