calender_icon.png 18 May, 2025 | 10:01 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రేపు దివ్యాంగుల కృత్రిమ అవయవాల కొలత శిబిరం

05-04-2025 12:00:00 AM

ముషీరాబాద్, ఏప్రిల్ 4: (విజయక్రాంతి) : తెలంగాణ రాష్ట్రంలో దివ్యాంగు లకు సాధికారతకు నారాయణ్ సేవా సంస్థాన్ దివ్యాంగుల కోసం కృత్రిమ అవయవాల కొలత, ఉచిత దివ్యాంగ్ నిర్ధారణ, శస్త్రచికిత్స ఎంపిక, నారాయణ్ లింబ్ కొలత శిబిరాన్ని ఈ నెల 6న చంపాపేట మినర్వా గార్డెన్స్లో  ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5 వరకు నిర్వహిస్తున్నట్లు నారాయణ్ సేవా సంస్థాన్ మీడియా, పబ్లిక్ రిలేషన్స్ డైరెక్టర్ భగవాన్ ప్రసాద్ గౌర్ తెలిపారు. ఈ మేరకు హైదర్ గూడ లోని న్యూస్ సెంటర్ లో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో  శిబిరానికి సంబంధించిన వాల్ పోస్టర్ ను ఆవిష్కరించారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రమాదాలు, అనారోగ్యాల కారణంగా అవయవాలను కోల్పోయిన వారికి, అలాగే కాలం చెల్లిన లేదా బరువైన కృత్రిమ అవయవాలతో పోరాడుతున్న వారికి సహాయం చేయడమే సంస్థ లక్ష్యం అన్నారు. పద్మశ్రీ అవార్డు గ్రహీత కైలాష్ మానవ్ ప్రేరణతో ఈ సంస్థ గత 40 సంవత్సరాలుగా  దివ్యాంగుల సేవ కు చేయడానికి అంకితమైందన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని డైరెక్టర్ గౌర్ వికలాంగులకు విజ్ఞప్తి చేశారు. ఈ శిబిరంలో పాల్గొనాలనుకునే వారు తమ ఆధార్ కార్డు, వికలాంగ ధృవీకరణ పత్రం, రెండు పాస్పోర్ట్ సైజు ఫోటోలను తీసుకు రావాలని అన్నారు.

మరిన్ని వివరాల కోసం ఫోన్: 7023509999 లో సంప్రదించాలన్నారు. సంస్థ పోషకురాలు అల్కా చౌదరి మాట్లాడుతూ ఈ కస్టమ్-మేడ్ కృత్రిమ అవయవాలను రెండు నెలల తర్వాత నిర్వహిం చబడే ఫిట్మెంట్ శిబిరంలో ఉచితంగా అందిస్తారన్నారు. మరో పోషకులు జస్మత్ భాయ్ మాట్లాడుతూ రాష్ట్ర మంత్రులను ఈ శిబిరానికి ఆహ్వానించామన్నారు. శిబిరం సమన్వయకర్త మహేంద్ర సింగ్ రావత్ మాట్లాడుతూ శిబిరంలో ఉచిత భోజనం, టీ సదుపాయం ఉంటుందన్నారు.