calender_icon.png 6 November, 2025 | 6:23 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తాగునీటి సమస్య పరిష్కరించాలని ఖాళీ బిందెలతో నిరసన

06-11-2025 04:56:05 PM

శామీర్ పేట్: అలియబాద్ మున్సిపాలిటీ కేంద్రంలో రామాలయం కాలనీ వాసులు తాగునీటి సమస్యను పరిష్కరించాలని గురువారం ఖాళీ బిందెలతో నిరసన వ్యక్తం చేశారు. అధికారులు, ప్రజా ప్రతినిధులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా స్పందన రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. నీటి సరఫరా కార్మికుడికి ఫోన్ చేయగా పొంతనలేని సమాధానం చెప్తున్నారని మండిపడ్డారు. నీళ్లు రాక చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, తమ కాలనీకి నీరు వచ్చేలా చూడాలని కోరుతున్నారు. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామన్నారు.