calender_icon.png 6 November, 2025 | 6:36 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పెండింగ్ వేతనాలు వెంటనే చెల్లించాలి

06-11-2025 04:58:16 PM

ఏఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి బోగె ఉపేందర్..

కుమ్రం భీం ఆసిఫాబాద్ (విజయక్రాంతి): ఎన్ హెచ్ ఎం కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు గత సెప్టెంబర్, అక్టోబర్ నెలల వేతనాలు, 7 నెలల పీఆర్ ఏరియర్స్ తక్షణమే చెల్లించాలని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి బోగే ఉపేందర్ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెండు నెలలుగా వేతనాలు రాక కార్మికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ప్రభుత్వ ఉద్యోగులలాగా వీరికి కూడా ప్రతి నెల 1వ తేదీనే వేతనాలు చెల్లించాలని కోరారు.

ఈ నెల 17న హైదరాబాద్‌లోని NHM కమిషనర్ కార్యాలయం వద్ద మహాధర్నా నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు టి.దివాకర్, ఉపాధ్యక్షుడు ఆత్మకూరు చిరంజీవి, కోశాధికారి నగేష్, సహాయ కార్యదర్శి రాందాస్, ఎన్ఎచ్ఎం సిబ్బంది శ్రీదేవి, ప్రకాష్, శ్రీకాంత్, విజయసాగర్, భవాని, సమత తదితరులు పాల్గొన్నారు.