17-09-2025 10:05:40 PM
మేడిపల్లి,(విజయక్రాంతి): బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు మంద సంజీవరెడ్డి ఆధ్వర్యంలో మాజీ కార్పొరేటర్లు, పార్టీ శ్రే ణులు, కలిసి బిఆర్ఎస్ పార్టీ ఆఫీసు నుండి మునిసిపల్ ఆఫీసు వరకు రాలిగా వెళ్లి, కమిషనర్ శైలజని తన ఛాంబర్ లో కలసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా సంజీవరెడ్డి మాట్లాడుతూ అభివృద్ధి, పరిపాలన కార్యక్రమాల్లో ప్రోటోకాల్ పాటించట్లేదని, గెలిచిన వారిని వదిలేసి, ఓడిన వారితో కార్యక్రమాలు నిర్వహించడం ఏమిటని, స్థానిక నాయకులు, ఎంపీ, ఎమ్మెల్యేలకు, ఆహ్వానం ఇవ్వకుండానే కార్యక్రమాలను నిర్వహించడం పై మండిపడ్డారు.అక్రమ షెడ్లు నిర్మాణాలు అధికారులకు కనిపించడం లేదా అని ప్రశ్నించారు. ఇలానే కొనసాగితే పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని అన్నారు. కమిషనర్ శైలజ సానుకూలంగా స్పందించి ఇకపై అధికారిక కార్యక్రమాలకు ప్రోటోకాల్ పాటిస్తామని తెలిపారు.