17-09-2025 10:09:32 PM
ఎమ్మెల్యే వేముల వీరేశం
చిట్యాల,(విజయక్రాంతి): పలు అభివృద్ధి పనులకు నకిరేకల్ శాసనసభ్యుడు వేముల వీరేశం బుధవారం శంకుస్థాపన చేశారు. చిట్యాల మండలంలోని సుంకెనపల్లి గ్రామంలో రూ. 12 లక్షల వ్యయంతో అంగన్వాడీ భవనం, 5 లక్షల వ్యయంతో నిర్మించనున్న సి.సి రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ఏపూర్ గ్రామంలో దాస్ ఫౌండేషన్ వారు 10 లక్షల వ్యయంతో అంగన్వాడి బిల్డింగ్ ని నూతనంగా నిర్మించి, మౌలిక వసతులను కల్పించగా ఎమ్మెల్యే, దాస్ ఫౌండేషన్ నుండి విజేత పాల్గొని ప్రారంభించారు. నూతనంగా ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీ జెండాను ఆవిష్కరించారు. చిన్న కాపర్తి గ్రామంలో 12 లక్షల వ్యయంతో అంగన్వాడి భవనంను, 20 లక్షల వ్యయంతో హెల్త్ సబ్ సెంటర్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు.